కొత్త లుక్ తెచ్చినా వర్కౌట్ కాలేదు.. మార్కెట్ నుంచి తప్పుకొన్న పల్సర్ 180
Advertisement
- రీ-ఎంట్రీ ఇచ్చిన 6 నెలలకే బజాజ్ పల్సర్ 180 బైక్ అమ్మకాలు బంద్
- బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లోని 'ఒరిజినల్' కేటగిరీ నుంచి పల్సర్ 180 తొలగింపు
- 2022లో తొలిసారి నిలిపివేత.. 2026 ఏప్రిల్ లో రీలాంచ్.. ఐదేళ్లలో ఇది రెండోసారి
- తక్కువ ధర, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నప్పటికీ అమ్మకాల్లో నిరాశపరిచిన మోడల్
- పల్సర్ 125, 150, 220ఎఫ్ మోడళ్లు మార్కెట్లో యథావిధిగా కొనసాగింపు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఐకానిక్ మోటార్‌సైకిల్ పల్సర్ 180ని భారత మార్కెట్ నుంచి మరోసారి నిలిపివేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఏప్రిల్ 2026లో తిరిగి ప్రవేశపెట్టిన ఈ బైక్, సరిగ్గా ఆరు నెలలు తిరిగేసరికి అధికారిక వెబ్‌సైట్ నుంచి అదృశ్యమైంది. గత ఐదేళ్ల వ్యవధిలో ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తప్పించడం ఇది రెండోసారి. అధికారికంగా బజాజ్ ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, కంపెనీ అధికారిక పోర్టల్‌లోని 'ఒరిజినల్' విభాగం నుంచి పల్సర్ 180ను పూర్తిగా తొలగించారు.
రూ.1.22 లక్షల (ఎక్స్-షోరూమ్) ఆకర్షణీయ ధరతో బజాజ్ ఈ బైక్‌ను ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాకపోవడమే ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అమ్మకాలు తగ్గితే మోడళ్లను పక్కన పెట్టే వ్యూహాన్ని అనుసరించే బజాజ్, గత జూన్‌లో ఎన్125ను తొలగించినట్లే ఇప్పుడు 180ని కూడా సైలెంట్‌గా పక్కకు తప్పించింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో పల్సర్ 125, 150, 220ఎఫ్ మోడళ్లు కొనసాగుతున్నాయి.
ఈ మోటార్‌సైకిల్‌లో 178.6 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 17 హెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, ముందు 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌తో పాటు డ్యూయల్ డిస్క్ బ్రేకులు (ఏబీఎస్), బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించాయి.