ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. ఆరుగురు దుర్మరణం
Advertisement
- ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన ప్రయాణికుల బస్సు
- ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
- టెహ్రీ గర్వాల్ జిల్లాలో తెల్లవారుజామున ఘటన
- సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు
- ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
ఉత్తరాఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఈ బస్సు హరిద్వార్ నుంచి చమోలికి బయలుదేరింది. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో టెహ్రీ గర్వాల్ జిల్లాలోని గూలార్ బజార్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి గూలార్ వంతెన కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
లోయలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 20 మందిని వెలికితీసి, అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. టెహ్రీ జిల్లా మేజిస్ట్రేట్ నితికా ఖండేల్వాల్, ఎస్ఎస్పీ శ్వేతా చౌబే వంటి ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.