విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన అమిత్ షా, చంద్రబాబు, పవన్
Advertisement
- విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల వేడుక
- ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం
- తొమ్మిది రంగాల్లో విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు
- అవార్డు గ్రహీతలకు పది లక్షల నగదు బహుమతి
విజయవాడ నగరంలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు - 2026 ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఒకే వేదికపై కేంద్ర హోంమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొనడంతో సభా ప్రాంగణం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదిక వేదికగా జరుగుతున్న ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకోగా.. రామోజీ గ్రూప్ సీఎండీ సి.హెచ్. కిరణ్ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు, పవన్ కల్యాణ్, సి.హెచ్. కిరణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేసి విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు అందించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అమిత్ షాకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు సమాజానికి అందించిన సేవలను స్మరిస్తూ, ఆయన జయంతి రోజైన నవంబర్ 16న రామోజీ గ్రూప్ ఈ ఎక్సలెన్స్ అవార్డులను ఏటా ప్రదానం చేస్తోంది. సమాజ హితం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశం. గతేడాది రామోజీ ఫిల్మ్‌సిటీలో తొలి విడత అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. ఇప్పుడు రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు.
గతేడాది 7 విభాగాల్లో పురస్కారాలు ఇవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 9కి పెంచారు. జర్నలిజం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, మహిళా సాధికారత, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం, యూత్ ఐకాన్ విభాగాలతో పాటు.. కొత్తగా విద్య, వైద్య-ఆరోగ్య రంగాలను కూడా చేర్చారు. దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది నామినేషన్లను సమగ్రంగా పరిశీలించిన అనంతరం నిపుణుల కమిటీ తుది జాబితాను ఖరారు చేసింది. ఎంపికైన 9 మంది పురస్కార గ్రహీతలకు ప్రశంసా పత్రం, ప్రత్యేక జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతిని అతిథుల చేతుల మీదుగా అందజేస్తున్నారు.