స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీ నగరాల హవా.. విశాఖకు అగ్రతాంబూలం
Advertisement
- స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ర్యాంకింగ్స్
- 10 లక్షల జనాభా కేటగిరీలో గ్రేటర్ విశాఖకు మొదటి స్థానం
- దేశంలోనే 3వ అత్యంత స్వచ్ఛమైన నగరంగా విజయవాడ
- 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరుకు 3వ ర్యాంకు
- దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా నవీ ముంబై ఎంపిక
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’ వార్షిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ నగరాలు ఘన విజయం సాధించాయి. దేశవ్యాప్త స్వచ్ఛతా ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలు జాతీయ స్థాయిలో పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. ఓవరాల్ విభాగంలో విజయవాడ దేశంలోనే మూడో అత్యంత స్వచ్ఛమైన నగరంగా నిలిచింది. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు.
వివిధ జనాభా వర్గాల వారీగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఏపీ నగరాలు ముందంజలో నిలిచాయి. 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని అగ్రగామిగా నిలిచింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే 3 లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఉజ్జయిని మొదటి స్థానం, చండీగఢ్ రెండో స్థానం సాధించాయి.
ఓవరాల్ ర్యాంకింగ్స్ పరిశీలిస్తే.. మహారాష్ట్రకు చెందిన నవీ ముంబై దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్‌కు చెందిన సూరత్ రెండో స్థానంలో నిలవగా, విజయవాడ మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. గత ఎనిమిదేళ్లుగా స్వచ్ఛ నగరాల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ నగరం ఈసారి టాప్ స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 10వ ఎడిషన్ (సూపర్ స్వచ్ఛ లీగ్)లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 4,751 నగరాల్లో ఈ సర్వే చేపట్టారు. గత ఏడాది సూపర్ స్వచ్ఛ లీగ్‌లో ఇండోర్ మొదటి స్థానంలో, సూరత్ రెండో స్థానంలో, నవీ ముంబై మూడో స్థానంలో నిలిచాయి.
ఇతర విభాగాల ఫలితాలు చూస్తే.. రివర్‌ఫ్రంట్ నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన రేవా మొదటి స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిలాస్‌పూర్ రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారణాసి మూడో స్థానంలో నిలిచాయి. తీరప్రాంత పట్టణాల కేటగిరీలో ఒడిశాకు చెందిన పూరీ అగ్రస్థానంలో నిలవగా, కేరళకు చెందిన అలప్పుళ రెండో స్థానం, మహారాష్ట్రకు చెందిన రత్నగిరి మూడో స్థానం పొందాయి. హిమాలయ ప్రాంత నగరాల విభాగంలో ఉత్తరాఖండ్‌కు చెందిన రుద్రపూర్ ప్రథమ స్థానాన్ని, జమ్ము ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. దేశవ్యాప్త పోటీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు అగ్రశ్రేణిలో నిలిచి రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మరింత పెంచాయి.