Advertisement

ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. ఈ తేదీల్లో వర్షాలు కురిసే ఛాన్స్‌!

Andhra
Advertisement
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం
  • ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం
  • నవంబర్‌ 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరవచ్చని అంచనా
  • దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. నవంబర్‌ 18 లేదా 19 నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరవచ్చని అంచనా వేసింది.

అల్పపీడనం ఏర్పడిన 24 గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతుందని వివరించారు.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాల కంటే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత అల్పపీడనం కదలికను బట్టి వర్షాల పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Andhra Pradesh WeatherLow Pressure AreaIMD Rain AlertBay of Bengal DepressionRayalaseema RainsSouth Coastal Andhra

More Telugu News

ప్రియుడ్ని పెళ్లాడిన 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

11 Nov, 16:25

9వ తరగతి పరీక్షల్లో బాగా రాశాడని కొడుక్కి బీఎండబ్ల్యూ కారు.. తండ్రి గిఫ్ట్ చూసి షాకైన జనం!

11 Nov, 16:23

సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రారంభం.. నిర్మాతగా సుకుమార్‌!

11 Nov, 16:05

కూటమికి కూడా విడాకులు తప్పేలా లేవు: పవన్ కల్యాణ్ వైవాహిక జీవితంపై తులసిరెడ్డి

11 Nov, 15:59

ఎత్తిపోతల పునరుద్ధరణకు రూ.632 కోట్లు.. ఖరీఫ్ నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సిద్ధం కావాలి: సీఎం చంద్రబాబు

11 Nov, 15:46

హెలికాప్టర్ నడిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. వీడియో వైరల్

11 Nov, 15:43

అమిత్ షా విశాఖ పర్యటన రద్దు

11 Nov, 15:43

కశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలు

11 Nov, 15:41

విశాఖ ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇక అంతా భోగాపురం నుంచే!

11 Nov, 15:39

కోల్‌కతా-ముంబై ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు

11 Nov, 15:22

వైట్‌కాలర్‌ జాబ్స్‌కు ఏఐ ముప్పు.. బ్లూకాలర్‌కు ఢోకా లేదు: సీఎం రేవంత్‌

11 Nov, 15:17

అమెరికాలో కొత్త వివాదం.. ట్రంప్ 'విజయ తోరణం'పై కోర్టుకెక్కిన కెన్నెడీ ఫ్యామిలీ

11 Nov, 15:13

విడాకులు కాకముందే పెళ్లి చేసుకుంటానంటూ వేధింపులు.. హైదరాబాద్‌లో వ్యక్తిపై కేసు నమోదు

11 Nov, 15:11

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్ మోసం.. ట్రస్ట్‌పై కేసు

11 Nov, 15:00
..More Telugu News