30 ఏళ్లకే రిటైర్మెంట్.. 14 పాత ఫ్లాట్లతో నెలకు లక్షల సంపాదన!
Advertisement
- ఇంటర్నెట్ హెల్త్‌కేర్ సేల్స్‌లో పనిచేసి 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఫ్యాన్ జున్‌జీ
- దాదాపు రూ. 2 కోట్ల పెట్టుబడితో 14 పాత ఫ్లాట్లను కొనుగోలు చేసిన వైనం
- అద్దెల ఆదాయం బాగున్నా ఇళ్ల నిర్వహణ తీవ్ర భారంగా మారిందన్న ఇన్వెస్టర్
- రియల్ ఎస్టేట్ కొనుగోళ్లకు స్వస్తి పలికి హై డివిడెండ్ స్టాక్స్ వైపు నిధుల మళ్లింపు
- ఆస్తి లిక్విడిటీ కోసమే స్టాక్ మార్కెట్ బాట పట్టినట్లు వెల్లడి
చిన్న వయసులోనే ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, ఉద్యోగ విరమణ చేయాలనే (FIRE - ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ) ఆలోచన నేటి యువతలో బాగా పెరుగుతోంది. ఇదే లక్ష్యంతో చైనాకు చెందిన 30 ఏళ్ల ఫ్యాన్ జున్‌జీ అనే యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలిచాడు. అయితే, ఆశించిన స్థాయిలో ఆర్థిక స్థిరత్వం లభించినప్పటికీ, ఇళ్ల నిర్వహణలో ఎదురవుతున్న తీవ్ర సవాళ్ల కారణంగా అతడు తన పెట్టుబడి వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రియల్ ఎస్టేట్‌కు గుడ్‌బై చెప్పి, స్టాక్ మార్కెట్‌లోని హై డివిడెండ్ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నాడు.
జిలిన్ ప్రాంతానికి చెందిన ఫ్యాన్ జున్‌జీ, చాంగ్‌షా నగరంలో ఇంటర్నెట్ హెల్త్‌కేర్ సేల్స్ విభాగంలో సుదీర్ఘ సమయం పనిచేశాడు. ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడి, త్వరగా రిటైర్ కావాలనే ఉద్దేశంతో 2023 నుంచి రియల్ ఎస్టేట్‌పై దృష్టి సారించాడు. చాంగ్‌షాలోని ప్రముఖ జియాంగ్యా ఆసుపత్రి సమీపంలో ఉన్న పాత, చిన్న డౌన్‌టౌన్ ఫ్లాట్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 20 లక్షల యువాన్లు (సుమారు రూ. 2 కోట్లు) వెచ్చించి మొత్తం 14 ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. మరమ్మతులు, నిర్వహణ సులభంగా ఉండేందుకు అన్ని ఫ్లాట్లను ఒకే రీతిలో ఆధునికీకరించాడు.
ఈ 14 ప్రాపర్టీలలో ప్రస్తుతం 11 ఫ్లాట్లు అద్దెకు నడుస్తున్నాయి. పన్నులు, ఏజెన్సీ ఫీజులు, ఆధునికీకరణ ఖర్చులతో కలిపి ఒక్కో ఫ్లాట్‌కు 1,50,000 యువాన్ల నుంచి దాదాపు 3,10,000 యువాన్ల వరకు ఖర్చయింది. వీటి ద్వారా నెలకు 1,700 నుంచి 2,200 యువాన్ల వరకు అద్దె వస్తోంది. తద్వారా ఏడాదికి దాదాపు 2,10,000 యువాన్లు (సుమారు రూ. 29 లక్షలు) అద్దెల రూపంలో సమకూరుతున్నాయి. 30 ఏళ్ల వయసులోనే అతడు తాను అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుని ఉద్యోగానికి వీడ్కోలు పలికాడు.
అయితే, ఆచరణలో రియల్ ఎస్టేట్ నిర్వహణ ఊహించిన దానికంటే ఎంతో కష్టతరంగా మారిందని ఫ్యాన్ జున్‌జీ గుర్తించారు. పదే పదే చెల్లించాల్సిన ఏజెన్సీ ఫీజులు, పన్నులు, నిరంతర మరమ్మతు ఖర్చులు, అద్దెదారుల సమస్యలతో పాటు ప్రాపర్టీ విలువల క్షీణత అతడి లాభాలను తగ్గించేశాయి. మానసిక ఒత్తిడి కూడా పెరిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, రియల్ ఎస్టేట్ కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలని 2026 అక్టోబర్ చివర్లో నిర్ణయం తీసుకున్నాడు. తన పెట్టుబడులను అధిక డివిడెండ్ ఇచ్చే స్టాక్స్, డివిడెండ్ ఫండ్లలోకి మళ్లిస్తున్నట్లు తెలిపాడు. స్టాక్ మార్కెట్‌లో నష్టభయం ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వచ్చే ఆదాయంతో పాటు అత్యధిక లిక్విడిటీ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్‌లో ఒక ఇంటిని అద్దెకు ఇవ్వాలన్నా లేదా విక్రయించాలన్నా వారాల సమయం పడుతుందని, అదే స్టాక్ మార్కెట్‌లో కేవలం కొద్ది రోజుల్లోనే లావాదేవీలు పూర్తవుతాయని, పైగా నిర్వహణ భారం ఉండదని అభిప్రాయపడ్డాడు.