పండగ ముగిసింది.. బాదుడు మొదలైంది.. విమాన ప్రయాణం ఇక భారమే!
Advertisement
- దీపావళి సెలవుల అనంతరం చెన్నైకి ప్రయాణికుల వెల్లువ
- విపరీతమైన డిమాండ్‌తో ఆకాశాన్నంటిన విమాన చార్జీలు
- సాధారణ ఛార్జీలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన టికెట్ ధరలు
దీపావళి పండగ ముగియడంతో సొంతూళ్ల నుంచి చెన్నై నగరానికి తిరిగి వచ్చేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం నుంచి కార్యాలయాలు, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానుండటంతో సోమవారం చెన్నై దేశీయ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ అనూహ్యమైన డిమాండ్‌తో విమానయాన సంస్థలు చార్జీలను అమాంతం పెంచేయడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి.
పండగ రద్దీ కారణంగా అనేక రూట్లలో టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇదే అదునుగా విమాన చార్జీలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులోని ఇతర నగరాల నుంచి చెన్నైకి వచ్చే విమాన టికెట్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సాధారణంగా రూ. 3,832 ఉండే సేలం-చెన్నై టికెట్ ధర ఏకంగా రూ. 13,098కి చేరింది. అలాగే, తిరుచ్చి నుంచి రూ. 4,954గా ఉండే చార్జీ రూ. 14,666కి, తూత్తుకుడి నుంచి రూ. 7,045గా ఉండే టికెట్ రూ. 17,639కి పెరిగింది. మధురై నుంచి కూడా టికెట్ ధర రూ. 4,673 నుంచి రూ. 11,877కు పెరిగింది.
కేవలం రాష్ట్రంలోని నగరాల నుంచే కాకుండా, దేశంలోని ప్రధాన నగరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఢిల్లీ నుంచి చెన్నైకి సాధారణంగా రూ. 10,167 ఉండే టికెట్ ధర రూ. 15,100కి చేరగా, ముంబై నుంచి చార్జీ రూ. 6,160 నుంచి రూ. 11,808కి పెరిగింది. విమానాల్లోనే కాకుండా బస్సులు, రైళ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. పండగకు ముందు చెన్నై నుంచి వెళ్లే సమయంలోనూ ఇదే తరహాలో చార్జీలు పెరిగిన విషయం తెలిసిందే.