రూ.500 నోట్లను రద్దు చేయాలి.. పెద్ద నోట్ల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన చంద్రబాబు

Andhra
Advertisement
  • రూ.100, రూ.200 నోట్లను మాత్రమే చలామణిలో ఉంచాలన్న చంద్రబాబు
  • పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీల పెంపుతోనే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టీకరణ
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓట్ల శాతం పెరిగిందని వెల్లడి
  • 2024 ఎన్నికల కంటే 3.6 శాతం పెరిగి 58.9 శాతానికి చేరిందన్న సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 575 స్థానాలను కూటమి గెలుచుకుందని వెల్లడి
  • 100 మున్సిపల్ మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి 94 స్థానాలను కైవసం చేసుకుందని వివరణ
దేశంలో రూ.500 నోట్లను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌లో కేవలం రూ.100, రూ.200 విలువ కలిగిన కరెన్సీ నోట్లను మాత్రమే చలామణిలో కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి డిజిటల్ కరెన్సీపై సమర్పించిన నివేదికను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయాలనే అంశంపై తాను నిరంతరం మాట్లాడుతుంటానని స్పష్టం చేశారు. "రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం రూ.100, రూ.200 నోట్లను మాత్రమే ఉంచాలి" అని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు వినియోగాన్ని నియంత్రించి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అవినీతిని సమర్థవంతంగా అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన కష్టమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి.. ధన బలాన్ని పూర్తిగా నియంత్రించగలిగిందని చంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం కూటమి విజయాన్ని మాత్రమే కాకుండా మంచి పాలన, సామాజిక న్యాయం, నూతన నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రజా మద్దతు మరింత పెరిగిందని ఆయన వివరించారు.

పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికలు రెండింటినీ కలిపి ఎన్డీయే కూటమికి 58.9 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో వచ్చిన 55.3 శాతం ఓట్లతో పోలిస్తే ఇది 3.6 శాతం పెరిగిందన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 శాతం నుంచి 33.56 శాతానికి పడిపోయిందని, అంటే 6.25 శాతం తగ్గిందని చెప్పారు. ఫలితంగా స్థానిక సంస్థల పోరులో కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల తేడా 25.34 శాతంగా నమోదైందని వివరించారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 59.9 శాతం ఓట్లు సాధించగా, వైసీపీకి కేవలం 34.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎం తెలిపారు. పట్టణాల్లో కూటమి ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు దక్కగా.. కూటమి 87.5 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసిందని చెప్పారు. కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం పట్టణాల్లో 25.6 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతంగా ఉందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి ఏకంగా 575 స్థానాలను కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి పూర్తి ఆధిపత్యం సాధించిందని, ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ అధిక జడ్పీటీసీ స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. ఏడు జిల్లాల్లో వైసీపీ ఒక్క జడ్పీటీసీ సీటును కూడా గెలవలేకపోయిందని వివరించారు. అలాగే, 9,818 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులు కూటమికే దక్కనున్నాయని తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిందని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం 100 మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవుల్లో కూటమి 94 స్థానాలను గెలుచుకుంది. ఇందులో 13 మేయర్ స్థానాల్లో 12 స్థానాలు, 87 ఛైర్‌పర్సన్ స్థానాల్లో 82 స్థానాలు కూటమి ఖాతాలో పడ్డాయి. పార్టీల వారీగా చూస్తే తెలుగుదేశం పార్టీ 70, జనసేన 20, బీజేపీ 4 మేయర్/ఛైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తం 3,941 వార్డుల్లో కూటమి 3,233 వార్డులను (82 శాతం) గెలుచుకుంది. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 95 చోట్ల కూటమి కౌన్సిల్ మెజారిటీ సాధించగా, 16 మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులనూ క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు, వైసీపీ కేవలం నాలుగు పట్టణ స్థానిక సంస్థలను, 558 వార్డులను మాత్రమే గెలుచుకుందని, 22 పట్టణాల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయిందని ముఖ్యమంత్రి తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Chandrababu Naidu500 Rupee Note BanCurrency DemonetizationDigital Transactions CorruptionAndhra Pradesh Local Body ElectionsNDA Alliance Vote Share

More Telugu News

'డయాబెటిస్'కు లేఖ రాసిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్

09 Nov, 20:36

‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. సరికొత్తగా నితిన్ లుక్

09 Nov, 20:01

తమిళనాడులో దారుణం.. ఎస్సైని కొట్టి చంపిన యువకులు.. రూ.40 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం విజయ్

09 Nov, 19:52

దిగొచ్చిన క్యాన్సర్ మందుల ధరలు.. కొత్త ధరలు నేటి నుంచే అమలు

09 Nov, 19:42

ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ కీలక హెచ్చరిక

09 Nov, 19:28

ప్రజాస్వామ్యం వెల్లివిరిస్తే ఎలా ఉంటుందో కడప జిల్లా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి: చంద్రబాబు

09 Nov, 19:03

41 ఏళ్ల వయసులో సెంచరీ.. జింబాబ్వే క్రికెటర్ ఘనత.. తొలి ఇన్నింగ్స్ రికార్డు రెండో ఇన్నింగ్స్ కే బద్దలు!

09 Nov, 18:55

అనంతపురంలో ఓడిపోయే అవకాశమే లేదు.. కానీ ఓటమి ఎదురైంది: సీఎం చంద్రబాబు

09 Nov, 18:08

జిల్లాల్లోనే పూర్తి వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

09 Nov, 17:53

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

09 Nov, 17:47

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

09 Nov, 17:40

బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. ఈ 5 వస్తువులను శుభ్రం చేస్తున్నారా?

09 Nov, 17:37

హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపల్, లెక్చరర్ అరెస్ట్!

09 Nov, 17:33

ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగాయనడం విడ్డూరం: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

09 Nov, 16:48
..More Telugu News