సౌత్ సినీ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలు!
Advertisement
- దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయన్న రాధిక ఆప్టే
- కొన్ని షూటింగ్‌లు మానసికంగా ఇబ్బంది పెట్టాయని వెల్లడి
- సెట్స్‌లో పురుషుల ఆధిపత్యం ఉండేదని వ్యాఖ్య
- భాష తెలియక ఒంటరితనానికి గురయ్యానని ఆవేదన
- ఏజెంట్, స్నేహితుల తోడు కూడా ఉండేది కాదని వెల్లడి
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలంటూ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్ని సినిమాల్లో పనిచేసినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. సెట్స్‌లో ఎక్కువ మంది పురుషులే ఉండేవారని, తనకు తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరితనానికి గురయ్యానని వెల్లడించింది. అక్కడి వాతావరణం పురుషాధిక్యంతో ఉండేదని పేర్కొంది. దక్షిణాదిలో ఓ పెద్ద వయసు హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందంటూ రాధికా ఆప్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మళ్లీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కీర్తి సురేశ్‌తో కలిసి నటించిన తన తాజా చిత్రం ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఈ విషయాలు పంచుకుంది. దక్షిణాది సినిమాల్లో కొన్నింటిలో పనిచేయడం మంచి అనుభూతినిచ్చిందని, మరికొన్ని మాత్రం మానసికంగా ఇబ్బంది పెట్టాయని తెలిపింది. బాలీవుడ్‌లోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు చెప్పింది.
దక్షిణాది చిత్రాల షూటింగ్ సమయంలో తనకు పరిచయస్తులు ఎవరూ ఉండేవారు కాదని రాధిక చెప్పుకొచ్చింది. ఏజెంట్ కూడా లేకుండా, స్నేహితుల తోడూ లేకుండా కొత్త ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చేదని తెలిపింది. సెట్స్‌లో ఎక్కువ మంది పురుషులే ఉండేవారని, వారు మాట్లాడే భాష తనకు అర్థమయ్యేది కాదని చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఒప్పందం ఉండేది కాదని, స్క్రిప్టు కూడా ముందుగా ఇచ్చేవారు కాదని వెల్లడించింది. దీంతో ఏం అడగాలో? ఎలా స్పందించాలో? తెలియక ఇబ్బందిపడ్డానని పేర్కొంది.
మరాఠీ సినిమాల్లో పనిచేసేటప్పుడు భాష తెలిసి ఉండటంతో పాటు, అవసరమైతే ఇంటికి వెళ్లే అవకాశం ఉండేదని చెప్పింది. కానీ దక్షిణాది సినిమాల షూటింగ్‌లలో మాత్రం పూర్తిగా ఒంటరిగా ఉండిపోయానని తెలిపింది.
గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రాధిక తెలిపింది. తన హద్దులను స్పష్టంగా చెప్పడం, తనకు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి మాట్లాడటం నేర్చుకున్నానని పేర్కొంది.
‘రక్త చరిత్ర’, ‘ధోని’, ‘ఎందుకంటే ప్రేమంట!’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘హరమ్’ వంటి దక్షిణాది చిత్రాల్లో రాధిక నటించింది.