వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా.. కడప జిల్లాలో కూటమి ప్రభంజనం!
Advertisement
- ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ప్రభంజనం
- 39 జడ్పీటీసీ స్థానాల్లో 23 ఏకగ్రీవం
- పోటీ జరిగిన 16 స్థానాల్లో 13 కూటమి ఖాతాలోకి
- టీడీపీ 30, భాజపా 3, జనసేన 3 స్థానాల్లో విజయం
- వైసీపీకి దక్కింది కేవలం రెండు జడ్పీటీసీ స్థానాలే
- పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారతికి 1,463 ఓట్ల మెజార్టీ
- రాజంపేటలో పోలి సుబ్బారెడ్డికి 17,440 ఓట్ల భారీ ఆధిక్యం
వైసీపీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో భారీ విజయాలు నమోదు చేసింది. మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గానూ 23 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు 71 మంది అభ్యర్థులు పోటీ పడగా.. 13 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
జిల్లాలో టీడీపీ 30, భాజపా 3, జనసేన 3 జడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్నాయి. వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజంపేట మండలంలో టీడీపీ అభ్యర్థి పోలి సుబ్బారెడ్డి 17,440 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. లింగాల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి యమ్మనూరు సరళాదేవి గెలుపొందారు.
ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలో 351 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 55 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 30కి పైగా చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరికొన్ని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా.. అక్కడక్కడ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.