మంచి నిద్రతో షుగర్, గుండెజబ్బుల ప్రభావానికి చెక్.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు!
Advertisement
- నిద్ర బాగున్నవారిలో ఆలోచనా సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తింపు
- 4 లక్షల మందికి పైగా ఆరోగ్య సమాచారంతో అధ్యయనం
- 54 వేల మందికి పైగా గుండె, జీవక్రియ వ్యాధిగ్రస్తుల పరిశీలన
- నిద్ర నాణ్యతను ఐదు అంశాల ఆధారంగా అంచనా
- మంచి నిద్రతో మెదడు గ్రే, వైట్ మ్యాటర్ పరిమాణం ఎక్కువ
Advertisement
మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారికి మంచి నిద్ర ఎంతో మేలు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధులతో మెదడు పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ.. నాణ్యమైన నిద్రతో ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు. తగినంత నిద్రపోయేవారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో పాటు మెదడు పరిమాణం కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. బ్రిటన్‌కు చెందిన యూకే బయోబ్యాంక్‌లోని 4 లక్షల మందికి పైగా మధ్య వయస్కులు, వృద్ధుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 54 వేల మందికి పైగా గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారే.
నిద్ర వ్యవధి, శరీర జీవగడియారం, నిద్రలేమి, గురక, పగటిపూట నిద్రమత్తు.. ఈ ఐదు అంశాల ఆధారంగా నిద్ర నాణ్యతను అంచనా వేశారు. దాదాపు 35 వేల మందికి సంబంధించిన మెదడు ఎంఆర్‌ఐ స్కాన్లను కూడా పరిశీలించారు.
చక్కగా నిద్రపోయేవారిలో సాధారణ ఆలోచనా సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సమాచారాన్ని వేగంగా అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. మెదడులోని గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ పరిమాణం కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది.
ఈ అధ్యయనం 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్'లో ప్రచురితమైంది. నిద్ర అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.