ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్
Advertisement
- నిన్నటి పోలింగ్‌లో రిగ్గింగ్, అక్రమాల ఫిర్యాదులతో ఈసీ నిర్ణయం
- తుపాను కారణంగా వాయిదా పడిన పోలింగ్ కూడా నేడే
- రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్, బూత్ కబ్జా వంటి అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రీపోలింగ్‌కు ఆదేశించింది. మొత్తం 6 జిల్లాల పరిధిలోని 7 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.
అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లోని నిర్దేశిత కేంద్రాల్లో అధికారులు తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, తుపాను కారణంగా నిన్న వాయిదా పడిన ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కూడా నేడే పోలింగ్ జరుగుతోంది. నిన్న జరిగిన పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 7) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
మరోవైపు, అధికార కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగింది ఎన్నికలు కావని, సెలక్షన్లు అని ఆయన వ్యాఖ్యానించారు.