అచ్చం సినిమాలో జరిగినట్టే.. మత గురువును ఇరికించేందుకు పోలీసుల కుట్ర.. వీడియో ఇదిగో !

National
Advertisement
  • పంజాబ్‌లో మత గురువు ఇంట్లో తొలుత డ్రగ్స్ పెట్టిన పోలీసు
  • ఆపై సోదాల్లో డ్రగ్స్ దొరికాయంటూ మత గురువు అరెస్ట్
  • రహస్య కెమెరా ఫుటేజీలో ఏఎస్ఐ డ్రగ్స్ ప్యాకెట్ పెడుతున్న దృశ్యాలు రికార్డ్
  • వీడియో బయటపడటంతో ఏఎస్ఐ సస్పెన్షన్, మత గురువు విడుదల
  • ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
Advertisement
సాధారణంగా కొన్ని ఘటనలు సినిమాలకే పరిమితం అనుకుంటాం. కానీ నిజంగా కూడా జరుగుతాయని పంజాబ్ పోలీసులు నిరూపించారు. ఓ మత గురువును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యం అందరినీ విస్తుపోయేలా చేసింది.  లుథియానాలోని ఖన్నా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఏఎస్ఐని సస్పెండ్ చేయగా, అరెస్ట్ అయిన మత గురువును అధికారులు వెంటనే విడుదల చేశారు.

అసలేం జరిగిందంటే?
స్థానికంగా ఉండే మహంత్ కశ్మీర్ గిరి అనే మత గురువు డ్రైవర్ గుర్జంత్ సింగ్‌ను పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహంత్‌కు కూడా ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. మంచం కింద హెరాయిన్ లభించిందని పేర్కొంటూ మహంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పోలీసుల తీరుపై అనుమానం వచ్చిన మహంత్ కుటుంబ సభ్యులు ఇంట్లో రహస్యంగా అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో అధికారిక సోదాల బృందం రాకముందే, మఫ్టీలో ఉన్న ఓ ఏఎస్ఐ ఇంట్లోకి ప్రవేశించి, గదులను పరిశీలించి, మంచం కింద ఓ చిన్న ప్యాకెట్‌ను పెట్టడం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన పోలీస్ బృందం, ఆ ప్యాకెట్‌ను "కనుగొన్నట్లు" నాటకమాడి మహంత్‌ను అరెస్ట్ చేసింది.

ఈ వీడియోను కుటుంబ సభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫుటేజీని పరిశీలించిన అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. మహంత్ కశ్మీర్ గిరిని వెంటనే విడుదల చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులే ఇలా డ్రగ్స్ పెట్టి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించడం పంజాబ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  
Advertisement

సంబంధిత వార్తలు

Mahant Kashmir GiriPunjab PoliceASI Sukhdev SinghLudhiana Drug CaseCCTV Framing EvidenceKhanna Punjab News

More Telugu News

సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్.. తుపాన్ల నష్టంపై ఆరా

03 Nov, 09:35

భార్యకు 20 ఏళ్లుగా నరకం.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు!

03 Nov, 09:29

డిస్నీలోనూ లేఆఫ్స్‌.. వేలాది ఉద్యోగాల కోతకు సిద్ధమైన వినోద రంగ దిగ్గజం

03 Nov, 09:18

డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్‌ వీటో’గా మారిపోతా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

03 Nov, 09:11

యూత్ ఒలింపిక్స్‌లో ధినిధికి కాంస్యం.. స్విమ్మింగ్‌లో నవశకం!

03 Nov, 08:47

రాప్తాడు ఉన్మాది హేమంత్‌కు జీవిత ఖైదు పడే ఛాన్స్.. కఠిన సెక్షన్లతో కేసులు నమోదు

03 Nov, 08:47

ఉద్యోగాల పేరుతో మోసం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విశాఖ యువకులు!

03 Nov, 08:46

వైసీపీకి ఎదురుదెబ్బ.. పులివెందుల మున్సిపల్‌ ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

03 Nov, 08:37

భారత్‌తో వాణిజ్య ఒప్పందం మా ఘనతే.. 127 హామీల జాబితా విడుదల చేసిన వైట్‌హౌస్

03 Nov, 08:36

అమెరికాను టెన్షన్ పెడుతున్న చైనా 'దైవ నాగ'.. బయటకొచ్చిన హై-రిజల్యూషన్ చిత్రం

03 Nov, 08:36

ఢిల్లీలో లాలూతో సోనియా భేటీ.. ఆరోగ్యంపై ఆరా

03 Nov, 08:15

మూడు వరల్డ్ కప్‌ల హీరో.. అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీడ్కోలు

03 Nov, 08:13

ఆడబిడ్డ ప్రాణంతో జగన్ రాజకీయం: ఎమ్మెల్యే గల్లా మాధవి

03 Nov, 07:46

తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజామున 3:30కు సీఎం చంద్రబాబు సమీక్ష

03 Nov, 07:43
..More Telugu News