వయసు పెరిగే కొద్దీ కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? అసలు కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!
Advertisement
- వయసుతో కండరాల బలం తగ్గడానికి కొత్త కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
- కణాల రక్షణ కోసం కండరాలు బలాన్ని త్యాగం చేస్తున్నట్లు వెల్లడి
- కార్డియోలిపిన్ స్థాయులు తగ్గడం కీలక కారణంగా గుర్తింపు
- ERRγ ప్రొటీన్ కండరాల మార్పులను నియంత్రిస్తున్నట్లు నిర్ధారణ
- ఎలుకల్లో కార్డియోలిపిన్ పునరుద్ధరణతో కండరాల క్షీణతకు అడ్డుకట్ట
- ముందస్తు మరణాలను కూడా ప్రయోగాల్లో పూర్తిగా నివారించిన పరిశోధకులు
Advertisement
వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజం. అయితే దీనికి కారణం కేవలం కండరాలు బలహీనపడటమే కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. కణాలు తమను తాము రక్షించుకునేందుకు శక్తిని త్యాగం చేస్తున్నాయని గుర్తించింది. అంటే కండరాలు బలాన్ని కోల్పోవడం వెనుక ఓ రక్షణ వ్యవస్థ పనిచేస్తోందన్నమాట! డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. వయసుతో వచ్చే కండరాల క్షీణతకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే దిశగా ఈ పరిశోధన ఆశలు రేకెత్తిస్తోంది.
కండరాల్లో ఏం మార్పులు జరుగుతాయి?
మన శరీరంలోని కండరాల్లో ప్రధానంగా రెండు రకాల ఫైబర్లు ఉంటాయి. ఫాస్ట్ ట్విచ్ ఫైబర్లు వేగంగా, ఎక్కువ బలంతో పనిచేస్తాయి. అయితే త్వరగా అలసిపోతాయి. స్లో ట్విచ్ ఫైబర్లు ఎక్కువసేపు పనిచేయగలవు. వీటికి శక్తిని అందించడంలో మైటోకాండ్రియా కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మైటోకాండ్రియా పనితీరు తగ్గుతుంది. దీంతో వేగంగా పనిచేసే ఫైబర్లు తగ్గి, నెమ్మదిగా పనిచేసే ఫైబర్ల సంఖ్య పెరుగుతుంది.
కీలకంగా మారిన కార్డియోలిపిన్
ఈ మార్పుల వెనుక కార్డియోలిపిన్ అనే కొవ్వు అణువు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది మైటోకాండ్రియా లోపలి పొర నిర్మాణాన్ని కాపాడుతుంది. శక్తి ఉత్పత్తికి సహకరిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎలుకలు, మనుషుల కండరాల్లో ఈ అణువు స్థాయులు తగ్గుతున్నట్లు గుర్తించారు. ఫలితంగా మైటోకాండ్రియా పనితీరు దెబ్బతింటోంది.
బలం కంటే రక్షణకే ప్రాధాన్యం
కార్డియోలిపిన్ తగ్గినప్పుడు మైటోకాండ్రియాలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ఆర్‌ఓఎస్) అనే క్రియాశీల అణువులు ఎక్కువగా ఉత్పత్తవుతాయి. ఇవి కణాలకు హాని కలిగించగలవు. అయితే కండరాల్లో ఫైబర్ల మార్పునకు సంకేతాలుగా కూడా పనిచేస్తాయి. ఈ సమయంలో ERRγ అనే ప్రొటీన్ కండరాల మార్పులను నియంత్రిస్తుంది. కణాలు అదనంగా అందిన గ్లూకోజ్‌ను శక్తి కోసం కాకుండా యాంటీఆక్సిడెంట్ల తయారీకి మళ్లిస్తాయి. తద్వారా నష్టాన్ని తగ్గించుకుంటాయి. అంటే కండరాలు తమ బలాన్ని తగ్గించుకుని కణాల మనుగడకు ప్రాధాన్యమిస్తున్నాయి.
ఎలుకల్లో ప్రయోగం.. కండరాల క్షీణతకు అడ్డుకట్ట
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు చిన్న వయసున్న ఎలుకల్లో కార్డియోలిపిన్ స్థాయులను తగ్గించారు. దీంతో వాటి కండరాల్లోనూ వృద్ధాప్యంలో కనిపించే మార్పులే వచ్చాయి. అనంతరం ఈ అణువు స్థాయులను సాధారణ స్థాయిలో మూడింట రెండొంతుల వరకు పునరుద్ధరించారు. దీంతో కండరాల క్షీణత తిరగబడటమే కాకుండా, ముందస్తు మరణాలనూ పూర్తిగా అడ్డుకోగలిగారు. అయితే ఈ ఫలితాలు ప్రస్తుతం ఎలుకల్లో మాత్రమే నిరూపితమయ్యాయి. మనుషుల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
భవిష్యత్తులో కొత్త చికిత్సలకు అవకాశం
కార్డియోలిపిన్ స్థాయులను పెంచడం, ERRγ ప్రొటీన్ పనితీరును ప్రభావితం చేయడం ద్వారా వయసుతో వచ్చే కండరాల బలహీనతను తగ్గించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికే కార్డియోలిపిన్ స్థిరత్వాన్ని కాపాడే ఎలామిప్రెటైడ్ ఔషధానికి అరుదైన బార్త్ సిండ్రోమ్ చికిత్సలో అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. అయితే సాధారణ వృద్ధాప్యంతో వచ్చే కండరాల క్షీణతకు ఈ ఔషధం పనిచేస్తుందా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పరిశోధన భవిష్యత్తులో కొత్త చికిత్సలకు మార్గం చూపవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.