రెబెల్స్ పై వెంటనే వేటు వేయండి: చంద్రబాబు ఆదేశం

Andhra
Advertisement
  • పొత్తు ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
  • ఎన్డీఏ రెబల్ అభ్యర్థులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశం
  • అభ్యర్థులను కాకుండా ఎన్డీఏను చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
Advertisement
పొత్తు ధర్మాన్ని ఎలాంటి పునరాలోచన లేకుండా పాటించాల్సిందేనని, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి ఎంతో శ్రమించి సీట్ల సర్దుబాటు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతలకు దీనిపై సానుకూల సందేశం పంపామని, కాబట్టి ఓటర్లు అభ్యర్థులను కాకుండా ఎన్డీఏ కూటమిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ చర్చలో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముగ్గురు నేతలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, కార్యకర్తల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. 

మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలపైనే కాకుండా, వారికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జిల్లాల బాధ్యతలను కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని తేల్చిచెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ, సొసైటీ ఎన్నికలు వస్తాయని, వాటికి ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని, ఆ తర్వాత ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduAP Cabinet MeetingNDA Alliance RebelsPawan KalyanAndhra Pradesh ElectionsTDP Jana Sena BJP Alliance

More Telugu News

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:50

నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి 'మెగావర్స్' టాక్ షో.. షూటింగ్ ప్రారంభం

29 Oct, 16:38

4-0 కోసం టీమిండియా గురి.. కుల్దీప్‌, వరుణ్‌కు ఛాన్స్‌? న్యూజిలాండ్‌కు మరో షాక్‌ తప్పదా!

29 Oct, 16:24

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

29 Oct, 16:17

బ్యాలెట్ ద్వారా బీజేపీకి బుల్లెట్ దింపాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:14

బైక్‌లపై మహిళలు అలా ఎందుకు కూర్చుంటారు?.. సౌకర్యమా, సంప్రదాయమా?

29 Oct, 16:05

అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై.. ప్రతి ఫ్రాంచైజీ విలువ రూ.14,000 కోట్లకు పైనే!

29 Oct, 16:02

నవంబర్‌ 1 నుంచి కీలక మార్పులు.. గ్యాస్‌ ధరలు, పెన్షన్‌, ఐటీఆర్‌ విషయంలో ఏం జరగబోతోంది?

29 Oct, 15:56

ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. కోచింగ్ బృందం నుంచి మలింగ ఔట్!

29 Oct, 15:43

కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

29 Oct, 15:36

ఎరుపెక్కిన ఆకాశం.. హాలీవుడ్ సినిమాను గుర్తుచేస్తున్న దృశ్యాలు.. అర్న‌బ్ తుపాను ప్రభావమేనా?

29 Oct, 15:28

వన్‌ప్లస్‌ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? రూ.5 వేల వరకు తగ్గింపు.. ట్యాబ్‌తో ఉచిత గిఫ్ట్‌!

29 Oct, 15:15

పక్షవాతం అని చెప్పాడు.. ఇంజెక్షన్ అనగానే లేచి పరిగెత్తాడు.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో!

29 Oct, 15:06

తిరుమలలో నీటి కొరత లేదు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

29 Oct, 14:59
..More Telugu News