టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు: మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ ఫైర్
Advertisement
- టాటా గ్రూప్‌ను నేరపూరితంగా నాశనం చేస్తున్నారన్న రాహుల్ గాంధీ
- మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు
- భయంతోనే వ్యాపారవేత్తలు మౌనంగా ఉన్నారని ఆరోపణ
Advertisement
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టాటా గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టాటా సంస్థను 'నేరపూరితంగా నాశనం' చేస్తున్నారని, అయినా దేశంలోని వ్యాపారవేత్తలు భయంతో నోరు మెదపడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.
"భారతీయ వ్యాపార రంగం మోదీ, అమిత్ షాల ఆటవస్తువు కాదు. మీకు ధైర్యం లేదు, మాకుంది. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాం" అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు.
టాటా గ్రూప్‌లో కొంతకాలంగా నడుస్తున్న అంతర్గత వివాదం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్‌నియామకాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సవాలు చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు తీర్మానం చెల్లదని, నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని ఆయన అక్టోబర్ 26న రాసిన లేఖలో ఆరోపించారు. ఈ వివాదం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, రాహుల్ ఆరోపణలపై బీజేపీ నేత సీఆర్ కేశవన్ స్పందించారు. రాహుల్ గాంధీకి ఆర్థికశాస్త్రంపై అవగాహన లేదని విమర్శించారు.