అర్నబ్ తుపాను నష్టంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సాయం కోరుతూ విజ్ఞప్తి

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
  • నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి
  • ప్రాథమిక అంచనాల ప్రకారం భారీగా పంట, ఆస్తి నష్టం
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ముందస్తు చర్యల కారణంగా ప్రాణనష్టాన్ని నివారించినట్టు వెల్లడి
Advertisement
ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను చూపిన ప్రభావం, రాష్ట్రంలో వాటిల్లిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

తుపాను తీవ్రత, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం తన లేఖలో వివరించారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. 

ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తీర ప్రాంతాల్లో అనేక రహదారులు ధ్వంసం కాగా, సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని వెల్లడించారు. దీనివల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ఇప్పటివరకు ఎక్కడా ప్రాణనష్టం నమోదు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తుపాను ప్రభావిత 14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. 

ప్రజలకు సహాయ చర్యలు అందించడం, విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు.

తుపాను నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం ఇలాగే కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని అమిత్ షాను ఆయన మరోసారి కోరారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduCyclone ArnabAmit ShahAndhra Pradesh Cyclone DamageCentral AssistanceDisaster Management

More Telugu News

కోస్తాంధ్రను వణికిస్తున్న అర్నబ్.. కూలిన చెట్లు, స్తంభాలు.. ఎక్కడ చూసినా జలవిలయం

28 Oct, 14:33

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన బంజారాహిల్స్ ఎస్ఐ

28 Oct, 14:30

సెక్రటేరియట్‌కు సీఎం చంద్రబాబు.. తుపాను పరిస్థితిపై సమీక్ష

28 Oct, 13:43

వెయ్యి కి.మీ. రేంజ్ మిస్సైళ్లు... శిక్షణ కోసం భారత్ వైపు జపాన్ చూపు

28 Oct, 13:06

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కేంద్రం ఉక్కుపాదం?

28 Oct, 13:04

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త అధికారులు

28 Oct, 12:58

యవ్వనంగా కనిపించాలా?.. కొలాజెన్‌ను పెంచే ఈ 4 మార్గాలు మీకోసమే!

28 Oct, 12:40

అర్నాబ్ బీభత్సం.. ఉప్పాడ తీరంలో 30 ఇళ్లు నేలమట్టం.. కొట్టుకుపోయిన రోడ్డు

28 Oct, 12:22

క్రీడాలోకంలో విషాదం.. మూడుసార్లు పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ బలవన్మరణం

28 Oct, 12:20

‘ఓం’లో నా ఆల్టర్ ఇగోను చూస్తున్నా: ఐపీఎస్ పాత్రపై సాయి పల్లవి

28 Oct, 12:18

అర్నాబ్ తుపాను బీభత్సం.. సహాయక చర్యలపై మంత్రులు నారాయణ, ఆనగాని టెలీకాన్ఫరెన్స్

28 Oct, 12:16

జైలు నుంచే జెడ్పీటీసీ ఎన్నికల బరిలో వైసీపీ నేత.. ప్రచారంలో భార్య!

28 Oct, 12:13

'రావణుడిని కాల్చరు.. కొలుస్తారు'.. గ్రేటర్ నోయిడాలోని ఈ గ్రామంలో దసరా ఎంతో ప్రత్యేకం!

28 Oct, 12:11

తిరుమల సమాచారం: 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు, సిఫార్సు లేఖల రద్దు

28 Oct, 12:07
..More Telugu News