రూపాయి కోలుకుంటోందనుకునేలోపే మళ్లీ పతనం.. ఆర్‌బీఐ చర్యలూ సరిపోవట్లేదా?
Advertisement
- డాలర్‌తో పోలిస్తే రూ.95 స్థాయి కీలకం
- బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 115 డాలర్లు
- జియో ఐపీఓ నిధుల మద్దతు తగ్గే అవకాశం
- డాలర్లకు దిగుమతిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్
- ఆర్‌బీఐ చర్యలున్నా కొనసాగుతున్న ఒత్తిడి
- అమెరికా ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి
Advertisement
డాలర్‌తో పోలిస్తే ఇటీవల కోలుకున్న భారత రూపాయికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు చర్యలు తీసుకున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై అనిశ్చితి కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు సంబంధించిన విదేశీ నిధుల రాకతో గతవారం రూపాయికి కొంత మద్దతు లభించింది. అయితే ఆ ఊతం త్వరలో తగ్గిపోవచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.93గా నమోదైంది. శుక్రవారం ముగింపు రూ.94.94తో పోలిస్తే ఇది స్వల్పంగా బలపడినట్లే. అయితే ఆ తర్వాత రూపాయిపై మళ్లీ ఒత్తిడి పెరిగింది. సోమవారం ఉదయం 11.10 గంటల సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95.115కు పడిపోయినట్లు రాయిటర్స్ నివేదించింది. డాలర్‌తో పోలిస్తే రూ.95 స్థాయిని దాటకుండా నిలదొక్కుకోవడం కీలకంగా మారింది.
ముడిచమురు ధరలే ప్రధాన సమస్య
రూపాయి రికవరీకి ప్రధాన అడ్డంకిగా ముడిచమురు ధరలు మారాయి. బ్రెంట్ క్రూడ్ ధర గతవారం ఆరు శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు దాదాపు 115 డాలర్ల స్థాయికి చేరింది. సౌదీ అరేబియాపై దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. భారత్ తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లు పెరిగి, దేశ వాణిజ్య లోటుపై ఒత్తిడి పడుతుంది. ఇది రూపాయి విలువను మరింత బలహీనపరచవచ్చు.
ఐపీఓ నిధుల మద్దతు ఎంతకాలం?
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన డాలర్ల ప్రవాహం రూపాయికి ఊతమిచ్చింది. అయితే ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ సోమవారంతో ముగియనుండటం, బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ జరగనుండటంతో ఈ మద్దతు తగ్గవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు. మరోవైపు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం కూడా రూపాయిపై ప్రభావం చూపుతోంది.
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. చమురు కంపెనీలకు అవసరమైన డాలర్లను ప్రత్యేక మార్గంలో అందించే ఏర్పాట్లు చేసింది. విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై నిబంధనలను కఠినతరం చేసింది. మార్కెట్లో డాలర్ల విక్రయం ద్వారా కూడా రూపాయికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కొనసాగుతోంది. అక్టోబర్ 16తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 5 బిలియన్ డాలర్లకు పైగా తగ్గి 721.02 బిలియన్ డాలర్లకు చేరాయి.
అమెరికా ఫెడ్ నిర్ణయంపైనా చూపు
ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కూడా రూపాయి దిశను ప్రభావితం చేయనుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చని మార్కెట్లు భావిస్తున్నా.. భవిష్యత్తులో రేట్ల పెంపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. అమెరికా డాలర్ బలపడితే భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గకపోవడం, ఐపీఓ నిధుల మద్దతు బలహీనపడటం, ఫెడ్ నిర్ణయంపై అనిశ్చితి.. ఈ మూడు అంశాలు రూపాయి రికవరీకి సవాల్‌గా మారాయి.