హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఫిలిప్స్, జాకబ్స్.. రెండో టీ20లో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

24-10-2026 Sat 14:48 | Sports
Advertisement
  • భారత్‌తో రెండో టీ20లో కివీస్ భారీ స్కోరు
  • టీమిండియా ముందు 181 ర‌న్స్ టార్గెట్‌
  • గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (56) అద్భుత హాఫ్ సెంచరీలు
  • నాలుగో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం
  • భారత బౌలర్లలో రెండు వికెట్లతో రాణించిన అర్ష్‌దీప్ సింగ్
Advertisement
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాట‌ర్లలో గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (56) హాఫ్ సెంచరీలతో కివీస్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచారు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్‌ప్లే ముగిసేలోపే 41 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో జతకట్టిన గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిలిప్స్ కేవలం 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, జాకబ్స్ 46 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు సాధించి జట్టుకు మంచి స్కోరు అందించారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 33 పరుగులిచ్చి రెండు వికెట్లతో సత్తా చాటాడు. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఇషాన్ కిషన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్‌కు బదులుగా ప్రిన్స్ యాదవ్ జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్ కూడా ఆడమ్ మిల్నే స్థానంలో జాకబ్ డఫీకి అవకాశం కల్పించింది.
Advertisement
Glenn PhillipsBevan JacobsIndia vs New Zealand 2nd T20Arshdeep SinghShreyas IyerChristchurch T20 Match

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more