రాయచోటిలో వేడెక్కిన రాజకీయం.. శ్రీకాంత్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మండిపల్లి
- రాయచోటి అభివృద్ధిపై చర్చకు రావాలని శ్రీకాంత్‌రెడ్డికి మండిపల్లి సవాల్
- రూ.450 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి
- కార్యకర్తలను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
రాయచోటి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. నేను చేసిన పనులు నేరుగా ప్రజల ముందే చూపిస్తా.. గతంలో నువ్వు చేసిన పనులేంటో చూపించే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ, తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గణాంకాలతో సహా వివరించారు.
గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.450 కోట్లతో జల్ జీవన్ మిషన్ కింద ఆరు మండలాలకు తాగునీటి ప్రాజెక్టు, రూ.420 కోట్ల అంచనాతో 25 వేల ఎకరాలకు సాగునీరందించే శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమృత్ పథకం నిధులను వెనక్కి పంపించిందని ఆయన విమర్శించారు.
ఎన్నికలు రాగానే శ్రీకాంత్‌రెడ్డి కార్యకర్తల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. "అధికారం కోల్పోయాక రాయచోటి మొహం చూడని వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. నీకు దమ్ముంటే రానున్న 40 రోజులు ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా నిలబడు" అని సవాల్ చేశారు. తాను 22 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఎవరి కాళ్లూ పట్టుకోలేదని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.