అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ పూనమ్ రౌత్ వీడ్కోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ పూనమ్ రౌత్ వీడ్కోలు

Former India opener Punam Raut retires from international cricket
  • దశాబ్దానికి పైగా సాగిన కెరీర్‌కు ముగింపు
  • 2017 ప్రపంచకప్ ఫైనల్లో పూనమ్ కీలక ఇన్నింగ్స్ 
  • దీప్తి శర్మతో కలిసి ప్రపంచ రికార్డు భాగస్వామ్యం
  • సోషల్ మీడియా ద్వారా నిర్ణయం వెల్లడి
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ పూనమ్ రౌత్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దశాబ్దానికి పైగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప గౌరవమని ఆమె తన ప్రకటనలో పేర్కొంది.

ముంబైకి చెందిన 37 ఏళ్ల పూనమ్, 2009లో వెస్టిండీస్‌పై వన్డే అరంగేట్రం చేసింది. తన కెరీర్‌లో 73 వన్డేలు, 4 టెస్టులు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వన్డేల్లో 3 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు సహా 2,299 పరుగులు చేసింది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

2017 ప్రపంచకప్ టోర్నీ భారత మహిళల క్రికెట్ రూపురేఖలను మార్చివేసిందని, ఆ చారిత్రాత్మక జట్టులో తాను భాగం కావడం గర్వకారణమని పూనమ్ గుర్తుచేసుకుంది. తన కెరీర్‌కు సహకరించిన బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, ఇండియన్ రైల్వేస్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. కోచింగ్ సర్టిఫికేషన్లు పూర్తి చేసినందున భవిష్యత్తులో ఆటతోనే తన ప్రయాణం కొనసాగిస్తానని ఆమె సూచనప్రాయంగా తెలిపింది.
Advertisement
Punam Raut
Punam Raut retirement
Indian womens cricket team
2017 Womens World Cup
BCCI
Mumbai cricket

More Telugu News