ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా 'స్వాతిరెడ్డి' నియామకం
- ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా 'స్వాతిరెడ్డి'
- ఆమె నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- గత ఎన్నికల ముందు సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్న స్వాతిరెడ్డి
- కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు టీడీపీ ప్రభుత్వంలో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా 'స్వాతి రెడ్డి' (గౌతమి శ్వేత కోట) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది.
గత ఎన్నికల ముందు 'స్వాతిరెడ్డి' సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వేధింపులను, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె టీడీపీకి మద్దతుగా తన గళాన్ని బలంగా వినిపించారు. ప్రతికూల పరిస్థితుల్లో, వేలాది మంది నుంచి ఆన్‌లైన్‌లో విమర్శలు ఎదురైనప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా పార్టీ వైఖరికి కట్టుబడి నిలిచారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో 'స్వాతిరెడ్డి' సేవలను గుర్తించి, ఆమెకు మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమె నియామకంపై టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
లోకేశ్ అన్న చెప్పింది ముమ్మాటికీ నిజం: స్వాతిరెడ్డి
తన నియామకంపై స్వాతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. " నన్ను గుర్తించిన నా దేవుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నన్ను గుర్తించిన నా అన్న లోకేశ్ గారికి సదా ఋణపడి ఉంటాను. ఈ రోజు మీరు నాకు ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. “కార్యకర్తే అధినేత” అని లోకేశ్ అన్న చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా పార్టీ తెలుగుదేశం కోసం కష్టపడుతూనే ఉంటాను" అంటూ ట్వీట్ చేశారు.