ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు

Tamil Nadu CM Vijay visits Indrakeeladri and performs special prayers to Kanaka Durgamma
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్
  • ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విజయ్
  • ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయన, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.

చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఆలయానికి చేరుకున్న సీఎం విజయ్‌కు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకోగా, పండితులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి రావడంతో విజయవాడ నగరంలో కోలాహలం నెలకొంది. ఆయన రాకను తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గన్నవరం విమానాశ్రయానికి తరలివచ్చారు. ఆయన కాన్వాయ్‌ను అనుసరిస్తూ అభిమానులు తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.
Advertisement
Vijay
Tamil Nadu CM Vijay
Kanaka Durga Temple
Indrakeeladri Vijayawada
Gannavaram Airport
Vijay Andhra Pradesh visit

More Telugu News