బెంగళూరు పబ్‌లో రగడ.. ఏపీ ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు!
- బెంగళూరు పబ్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఏపీ ఐఏఎస్ అధికారి
- అధికారి వికాస్ మర్మత్‌తో పాటు ఆయన స్నేహితులపై క్రిమినల్ కేసు నమోదు
- సీఎం నియోజకవర్గం కుప్పం అభివృద్ధి ప్రాధికార సంస్థ పీడీగా బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని ఓ పబ్‌లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన స్నేహితులపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా, దీనిపై ఆయన తీవ్రంగా స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరపాలని సీఎస్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని ‘కావోర్ బార్ అండ్ రెస్టారెంట్’లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటినా పబ్ నడుపుతుండటంతో పాటు, వయసు నిర్ధారణ కోసం అక్కడ ఉన్న వారి ఐడీ కార్డులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే స్నేహితులతో ఉన్న వికాస్ మర్మత్, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
మద్యం మత్తులో ఉన్న ఆయన, పోలీసులను దూషించడమే కాకుండా, వారిపై దాడికి ప్రయత్నించి విధులకు ఆటంకం కలిగించారని సీసీబీ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వికాస్ మర్మత్‌తో పాటు ఆయన స్నేహితులు అభయ్, ఉదయ్ సింగ్, నితీష్, రోషన్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నం. 150/2026) నమోదు చేశారు.
వికాస్ మర్మత్ 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఉన్నత హోదాలో ఉన్న అధికారి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.