రైలు రద్దయినా, ఆలస్యమైనా.. పూర్తి డబ్బులు తిరిగొచ్చే రూల్స్ ఇవే!
- రైలు పూర్తిగా రద్దయితే ఈ-టికెట్‌కు సాధారణంగా ఆటోమేటిక్ రిఫండ్
- కౌంటర్‌లో తీసుకుంటే అసలు టికెట్ సమర్పించి రిఫండ్‌కు దరఖాస్తు చేసుకోవాలి
- కన్ఫర్మ్ టికెట్ రద్దుపై సమయాన్ని బట్టి ఛార్జీల వర్తింపు
- వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ టికెట్లకు క్లర్కేజ్ ఛార్జీ కోత
- కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ రద్దుపై లభించని రిఫండ్
రైలు ప్రయాణం రద్దయినా, రైలు ఆలస్యమైనా.. టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా? మనమే టికెట్ రద్దు చేసుకుంటే ఎంత మొత్తం తిరిగి వస్తుంది? తత్కాల్ టికెట్లకు రిఫండ్ ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. అయితే, రైల్వే నిబంధనలపై అవగాహన ఉంటే అనవసరంగా డబ్బులు నష్టపోకుండా చూసుకోవచ్చు. టికెట్ రద్దు చేసే సమయం, ప్రయాణ పరిస్థితిని బట్టి రిఫండ్ మారుతుంది.
రైలు పూర్తిగా రద్దయితే..
భారతీయ రైల్వే రైలును పూర్తిగా రద్దు చేస్తే టికెట్ ఛార్జీ మొత్తం తిరిగి పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసిన ఈ-టికెట్లకు ప్రత్యేకంగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుక్ చేసిన చెల్లింపు ఖాతాలోకే రిఫండ్ డబ్బులు తిరిగొస్తాయి. కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రం నిర్దేశిత గడువులో అసలు టికెట్‌ను సమర్పించి రిఫండ్ పొందాలి. సాధారణంగా రైలు బయలుదేరాల్సిన సమయం నుంచి 72 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
టికెట్ మనమే రద్దు చేస్తే..
ప్రయాణికుడు తనంతట తానే కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఛార్జీలు వర్తిస్తాయి. రైలు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందే రద్దు చేస్తే నిర్ణీత మొత్తం మినహాయిస్తారు. బయలుదేరే సమయం దగ్గరపడే కొద్దీ కోత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కన్ఫర్మ్ టికెట్ రద్దుపై సాధారణంగా రిఫండ్ లభించదు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులకు మినహాయింపులు ఉంటాయి.
వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ టికెట్లు
వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్‌ఏసీ టికెట్లను రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు రద్దు చేసుకుంటే, నిబంధనల ప్రకారం క్లర్కేజ్ ఛార్జీ మినహాయించి మిగిలిన మొత్తం తిరిగి చెల్లిస్తారు.
తత్కాల్ టికెట్లకు ప్రత్యేక నిబంధనలు
కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్‌ను ప్రయాణికుడు తనంతట తానే రద్దు చేసుకుంటే సాధారణంగా రిఫండ్ ఉండదు. అయితే, రైలును పూర్తిగా రద్దు చేసినప్పుడు లేదా బోర్డింగ్ స్టేషన్‌లో రైలు మూడు గంటలకు మించి ఆలస్యమైనప్పుడు ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంటే పూర్తి రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భాల్లో నిర్దేశిత విధానాన్ని పాటించాలి.
రైలు ఆలస్యమైతే ఏం చేయాలి?
బోర్డింగ్ స్టేషన్‌కు రైలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే ప్రయాణాన్ని విరమించుకున్న వారు పూర్తి రిఫండ్ కోరవచ్చు. ఆన్‌లైన్ టికెట్ ప్రయాణికులు నిర్దేశిత గడువులో టికెట్ డిపాజిట్ రసీదు (టీడీఆర్) సమర్పించాలి. కౌంటర్ టికెట్లకు సంబంధించి రైల్వే నిబంధనల ప్రకారం రిఫండ్ కోరవచ్చు.
డబ్బులు తిరిగి రాకపోతే..
రిఫండ్ ఆలస్యమైనా, దరఖాస్తులో సమస్య వచ్చినా ఐఆర్‌సీటీసీ ఈ-క్వెరీ పోర్టల్ (equery.irctc.co.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే సేవలకు సంబంధించిన సమస్యలను రైల్‌మదద్ వేదికలోనూ నమోదు చేయవచ్చు. టికెట్ రకం, రద్దు సమయం, ప్రయాణ పరిస్థితిని బట్టి నిబంధనలు మారవచ్చు. అందువల్ల రిఫండ్ కోరే ముందు అధికారిక రైల్వే మార్గదర్శకాలను పరిశీలించడం మంచిది.