శ్రీవారి సన్నిధిలో 'రణబాలి' జంట.. విజయ్, రష్మిక ప్రత్యేక పూజలు

శ్రీవారి సన్నిధిలో 'రణబాలి' జంట.. విజయ్, రష్మిక ప్రత్యేక పూజలు

Vijay Deverakonda and Rashmika Mandanna visit Tirumala for Ranabali movie success
  • 'రణబాలి' సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుమల వెళ్లిన విజయ్-రష్మిక
  • నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు శ్రీవారి దర్శనం
  • దసరా కానుకగా ఈ నెల‌ 16న 'రణబాలి' విడుదల
  • సినిమాలో విలన్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ
  • విజయ్-రష్మిక కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది
టాలీవుడ్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ కొత్త చిత్రం 'రణబాలి' విడుదల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీరిద్దరూ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో 'రణబాలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా, దానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన విజయ్, రష్మిక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్శనం అనంతరం వారు హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్-రష్మిక జంటగా నటిస్తున్న మూడో చిత్రం కావడంతో 'రణబాలి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం ఈ నెల‌ 16న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీనిని తెరకెక్కింది. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ది మమ్మీ' ఫేమ్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్ర బృందం, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రేక్షకుల్లోకి సినిమాను మరింతగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే, దేశవ్యాప్తంగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali Movie
Tirumala Temple
Rahul Sankrityan
Mythri Movie Makers

More Telugu News