మీరు మానవత్వానికే హీరో.. భారత పైలట్‌పై ఇజ్రాయెల్ అధ్యక్షుడి ప్రశంసలు
- సహ పైలట్ దాడిని అడ్డుకుని 174 మందిని కాపాడిన భారత పైలట్
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటన
- స్మిత్.. భారత్, ఇజ్రాయెల్, మానవాళికే హీరో అని కొనియాడిన అధ్యక్షుడు హెర్జోగ్
- వందేళ్ల నాటి భారత సైనికులతో పైలట్‌ను పోల్చిన ఇజ్రాయెల్
- కోలుకున్నాక జెరూసలేం వచ్చి అవార్డు స్వీకరించాలని ఆహ్వానం
విమానంలో సహ పైలట్ దాడిని ధైర్యంగా తిప్పికొట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' అందజేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ శనివారం కెప్టెన్ స్మిత్‌కు ఒక లేఖ రాశారు. వందేళ్ల క్రితం పవిత్ర భూమిలోని నగరాల విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన భారత సైనికుల సరసన స్మిత్ నిలుస్తారని హెర్జోగ్ కొనియాడారు. "మీరు ఇకపై మా ప్రజల చరిత్రలో ఒక చిరస్మరణీయ భాగం" అని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా వెల్లడిస్తూ "కెప్టెన్ స్మిత్ మచ్చర్.. మీరు ఇజ్రాయెల్, భారత్, యావత్ మానవాళికి హీరో" అని ప్రశంసించారు.
కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన హెర్జోగ్.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత జెరూసలేంకు వచ్చి తన చేతుల మీదుగా అవార్డును స్వీకరించాలని ఆహ్వానించారు. ప్రాణాపాయ స్థితిలోనూ ఆయన చూపిన ధైర్యసాహసాలు, విచక్షణ అమోఘమని కీర్తించారు.
ఇటీవల దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లోని గొడ్డలితో సహ పైలట్ హమామ్ అల్-హమామి.. కెప్టెన్ స్మిత్ మాచర్‌పై దాడికి యత్నించాడు. అయితే, కెప్టెన్ స్మిత్ ధైర్యంగా ఆ దాడిని ఎదుర్కొని విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. ఈ ఘటనను యూఏఈ అధికారులు 'ఉగ్రవాద దాడి'గా అభివర్ణించారు.