మా దేశ విధానాలను శాసించొద్దు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్
- దేశ విధానాలను ఏ బిలియనీర్ నిర్దేశించలేరంటూ మస్క్‌కు కమల్ స్ట్రాంగ్ రిప్లయ్
- పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరి, రక్షణాత్మక చర్యలపై సూటి విమర్శలు
- శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని సూచన
- భారత్ భవిష్యత్తును భారతీయులే నిర్ణయిస్తారని స్పష్టం చేసిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత కమల్ హాసన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విధానాలను ఏ బిలియనీర్, అది భారతీయుడైనా, అమెరికన్ అయినా నిర్దేశించలేరని ఆయన తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు. శాటిలైట్ ఇంటర్నెట్, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన సూటిగా ప్రశ్నించారు.
"మిస్టర్ మస్క్, ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ బిలియనీర్ కూడా, అది భారతీయమైనా, అమెరికన్ అయినా, ఒక దేశ విధానాలను శాసించకూడదు.
శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పోటీని మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. అది భారతీయ కంపెనీ అయినా, గ్లోబల్ సంస్థ అయినా సరే. కానీ, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండేలా, ఆచరణాత్మకమైన, చవకైన సేవలు అందించాలి. అధిక సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, పరికరాల ఖర్చులతో సాధారణ కుటుంబాలకు ఈ సేవలు అందని ద్రాక్షలా మారకూడదు. టెక్నాలజీ అనేది డిజిటల్ అంతరాలను పూడ్చాలి కానీ, కొత్త అంతరాలను సృష్టించకూడదు.
మా నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కేవలం వాణిజ్య ఆస్తులు కావని, అవి మా దేశ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలని మేం భావిస్తాం. జాతీయ భద్రత విషయంలో మేం ఎలాంటి రాజీ పడబోము. ఈ విషయంలో మా నిబంధనలు చర్చనీయాంశం కావు.
ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. పశ్చిమ దేశాలు తమ దేశాల్లో రక్షణవాదాన్ని పాటిస్తూ, మాకు మాత్రం స్వేచ్ఛా విపణి గురించి ప్రబోధించలేవు. తమ దేశీయ పరిశ్రమను కాపాడుకోవడానికి చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా 100% సుంకాలు విధించింది. మేం కూడా మా దేశీయ తయారీదారులను రక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటాం. భద్రతా కారణాలతో భారత్, అమెరికా రెండూ హువావే సంస్థను నిరోధించాయి. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సమాన అవకాశాల గురించి మాట్లాడటం సరికాదు.
మాది ఒక ప్రజాస్వామ్య దేశం. మా బలాలు, బలహీనతలను మేమే ప్రశ్నించుకుంటాం, పరిష్కరించుకుంటాం. ఉదాహరణకు, గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ అందించే ‘భారత్‌నెట్’ పథకాన్ని మేమే సమీక్షించుకుంటాం. 2026 కాగ్ ఆడిట్ నివేదిక ప్రకారం, రూ.39,888 కోట్లు ఖర్చు చేసినా, సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న గ్రామ పంచాయతీలలో కేవలం 33.2% మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని మేమే ప్రశ్నించుకుంటాం. అదే సమయంలో, ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ డేటాను అందిస్తూ, కోట్లాది మందిని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చిన మా టెలికాం రంగాన్ని, నిబంధనలను చూసి మేం గర్విస్తాం.
తుదిగా ఒక్కటే మాట. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం, వలస రాజ్యం కాదు. మేం ప్రపంచాన్ని ఆహ్వానిస్తాం, కానీ మా భవిష్యత్తును మేమే, భారత ప్రజలమే నిర్దేశించుకుంటాం. పశ్చిమ దేశాల స్వార్థ ప్రయోజనాలు, వారి ద్వంద్వ ప్రమాణాలు, లేదా ఏ బిలియనీర్ అయినా సరే.. మా నిర్ణయాలను ప్రభావితం చేయలేరు" అంటూ కమల్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.