జీఓ 59పై మంత్రి పొంగులేటి ప్రకటన.. నెలలోగా దరఖాస్తులు క్లియర్
Add ap7am to your home Screen

జీఓ 59పై మంత్రి పొంగులేటి ప్రకటన.. నెలలోగా దరఖాస్తులు క్లియర్

Ponguleti Srinivas Reddy announces GO 59 applications clearance within one month
  • జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం
  • సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలులో భాగంగా ఈ నిర్ణయమని వెల్లడి
  • దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు జారీ చేశామన్న మంత్రి
తెలంగాణలో జీఓ 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 500 చదరపు గజాల లోపు ఉన్న ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 22-ఏ సమస్యల పరిష్కార హామీ అమలులో ఇది మరో కీలక ముందడుగు అని అన్నారు.

ఈ మేరకు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం మెమో నెం. 48030 జారీ చేసిందని మంత్రి వివరించారు. "జీఓ 59 అమలులో ఎలాంటి అక్రమాలకు తావులేదు. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి" అని ఆయన హామీ ఇచ్చారు. గతంలో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్‌లపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని పొంగులేటి వెల్లడించారు.

సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఏ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని... 10 నుంచి 12 రకాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొంది 22-ఏ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.
Advertisement
Ponguleti Srinivas Reddy
Telangana GO 59
Revanth Reddy
Land Regularization Telangana
22A Land Issues
Telangana Revenue Department

More Telugu News