ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారు: అనిత
- పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన అనిత
- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి
- గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమని వ్యాఖ్య
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆమె రూ.75 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.3 కోట్ల విలువైన స్త్రీ నిధి రుణాలను, పనిముట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అనిత మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమని, దీని ద్వారా సుమారు 28 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని వివరించారు.
‘‘గొడ్డలి పార్టీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది’’ అని అనిత అన్నారు. రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ‘ఈగల్ టీమ్స్’ ఏర్పాటు చేశామని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.