చాట్ జీపీటీ-6 ఆస్ట్రా మాయ.. తిరుమల రూమ్ బుకింగ్‌ను పేమెంట్ వరకు చేసి చూపించిందా?
- టీటీడీ వసతి కోసం ఏఐకి టెక్కీ విన్నపం
- పేమెంట్ పేజీ వరకు బుకింగ్ పూర్తిచేసిన జీపీటీ-6 ఆస్ట్రా
- ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్
- ఏఐ సామర్థ్యంపై ఆశ్చర్యం, భద్రతపై ఆందోళనలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు గంటల తరబడి శ్రమించే పనులను సైతం క్షణాల్లో పూర్తి చేస్తూ అబ్బురపరుస్తోంది. తాజాగా, అత్యంత రద్దీగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పోర్టల్‌లో ఒక ఏఐ మోడల్ వసతి గదులను పేమెంట్ దశ వరకు విజయవంతంగా పూర్తి చేసినట్లుగా చూపిస్తున్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. "టెక్ బై పవన్" అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ ఈ వీడియోను పంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే, "జీపీటీ-6 ఆస్ట్రా"గా పేర్కొంటున్న ఒక ఏఐ చాట్‌బాట్‌కు "డిసెంబర్ 21న వసతి బుక్ చేయి" అని ఆయన ఒకే ఒక్క ప్రాంప్ట్ (ఆదేశం) ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ ఏఐ, యూజర్ లాగిన్ వివరాలను ఉపయోగించుకుని, అత్యంత రద్దీగా ఉండే టీటీడీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించింది. అందుబాటులో ఉన్న వసతి ఆప్షన్లను ఎంచుకుని, బుకింగ్ ప్రక్రియను ఫైనల్ మెట్టు వరకు తీసుకెళ్లింది. చివరికి, పేమెంట్ చేయాల్సిన పేజీ వరకు వెళ్లి ఆగింది. ఆర్థిక వివరాలు అందించనందున ఆ ఏఐ ఏజెంట్ అక్కడితో ప్రక్రియను నిలిపివేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ అసిస్టెంట్లు ఇలాంటి క్లిష్టమైన, సమయంతో కూడిన పనులను ఎంత సులభతరం చేయగలవో ఈ వీడియో ఒక ఉదాహరణ అని కొందరు ప్రశంసిస్తున్నారు. టీటీడీ దర్శనం లేదా వసతి స్లాట్లు విడుదలైనప్పుడు సెకన్ల వ్యవధిలో బుక్ చేసుకోవడం ఎంత కష్టమో తెలిసిన భక్తులు, ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నారు.
అయితే, మరోవైపు భద్రతా నిపుణులు, పలువురు నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత లాగిన్ వివరాలను, పాస్‌వర్డ్‌లను ఏఐ సిస్టమ్‌లకు అందించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఏఐ యాక్సెస్ చేయడం వల్ల సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.