'ప్యారడైజ్' సినిమాకి పోతున్నా: కేటీఆర్

'ప్యారడైజ్' సినిమాకి పోతున్నా: కేటీఆర్

KTR says I am going to watch The Paradise movie
  • ఈ రాత్రి 'ప్యారడైజ్' సినిమాను థియేటర్లో చూడబోతున్నానన్న కేటీఆర్
  • తనకు ఇష్టమైన నటుల్లో నాని ఒకరని వెల్లడి
  • చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థియేటర్‌లో సినిమా చూడనున్నారు. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ 'ది ప్యారడైజ్'ను శనివారం రాత్రి వీక్షించబోతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. నాని తనకు ఇష్టమైన నటుల్లో ఒకరని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


గోదావరిఖని బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కేటీఆర్ థియేటర్‌కు వెళ్లడానికి కేవలం సినిమాపై ఉన్న ఇష్టమే కాకుండా, మరొక ప్రధాన కారణం కూడా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోకడలను, ఆయన శైలిని పోలి ఉందనే టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కథను కీలక మలుపు తిప్పే ఈ పాత్ర చుట్టూనే గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో.. కేటీఆర్ ఈ సినిమాను స్వయంగా చూసేందుకు సిద్ధమవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
KTR
The Paradise Movie
Natural Star Nani
MLA Shankaranna
Srikanth Odela
KCR Resemblance

More Telugu News