'డీజే టిల్లు' దర్శకుడి కొత్త సినిమా.. ఆసక్తి రేపుతున్న 'అనుమాన పక్షి' ట్రైలర్

'డీజే టిల్లు' దర్శకుడి కొత్త సినిమా.. ఆసక్తి రేపుతున్న 'అనుమాన పక్షి' ట్రైలర్

DJ Tillu Director New Movie Anumana Pakshi Trailer Is Interesting
  • 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం 'అనుమాన పక్షి'
  • హీరో అనుమానం అనే బలహీనత చుట్టూ తిరిగే కథ
  • క్రైమ్, డార్క్ కామెడీతో ఆకట్టుకుంటున్న ట్రైలర్
  • హీరోహీయిన్లుగా రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్  
  • సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌
‘డీజే టిల్లు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో వినూత్న కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. టాలెంటెడ్ నటుడు రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ కథ మొత్తం హీరో పాత్రకున్న ‘అనుమానం’ అనే బలహీనత చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానించే వ్యక్తిగా రాగ్ మయూర్ నటన, హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ అంశాలను కూడా దర్శకుడు జోడించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, అజయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 

వైవిధ్యమైన కథతో వస్తున్న ఈ ‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విమల్ కృష్ణ ఎలాంటి వినోదాన్ని అందిస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Vimal Krishna
Anumana Pakshi Trailer
Rag Mayur
DJ Tillu Director
Anumana Pakshi Release Date
Telugu Dark Comedy Movie

More Telugu News