బార్బర్ ఉద్యోగానికీ ఏఐ ఎఫెక్ట్.. వైరల్ వీడియోపై హర్ష్ గోయెంకా కామెంట్
- మోషన్ క్యాప్చర్ సూట్‌తో హెయిర్‌కట్ చేస్తున్న బార్బర్ వీడియో వైరల్
- వీడియోను షేర్ చేసిన ఆర్‌పీజీ ఛైర్మన్ హర్ష్ గోయెంకా
- బార్బర్ కదలికలను రికార్డు చేసిన కెమెరాలు, సెన్సర్లు
- ఈ డేటా ఏఐ శిక్షణకు ఉపయోగపడొచ్చనే చర్చ
- ఏఐ వల్ల భవిష్యత్తులో బార్బర్ ఉద్యోగాలకూ ముప్పు రావొచ్చని గోయెంకా వ్యాఖ్య
ఏఐ ప్రభావం ఏ రంగానికైనా చేరుకుంటోందని చెప్పడానికి ఈ వీడియో మరో ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా సెలూన్‌లో కస్టమర్‌కు హెయిర్‌కట్ చేసే బార్బర్.. ఒంటినిండా సెన్సర్లు, కెమెరాలతో కూడిన హైటెక్ సూట్ ధరించి పని చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇదే కనిపిస్తోంది. దీనిపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు.
ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ సాధారణ బార్బర్ షాప్‌లో హెయిర్‌కట్ చేస్తున్న వ్యక్తి పూర్తిస్థాయి మోషన్ క్యాప్చర్ పరికరాలు ధరించి కనిపించాడు. తలకు కెమెరాలు, శరీరానికి వైర్లతో కూడిన హార్నెస్, సెన్సర్లు, చేతులకు ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయి.
బార్బర్ కదలికలపై నిఘా
ఇంతటి పరికరాలు ధరించినా అతను సాధారణంగానే హెయిర్‌కట్ చేశాడు. కత్తెర, ఇతర పరికరాలు ఉపయోగిస్తూ జుట్టు కత్తిరించడం, వివిధ టెక్నిక్‌లు పాటించడం కనిపించింది. ఈ క్రమంలో అతని చేతుల కదలికలు, కోణాలు, పనితీరును సెన్సర్లు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి డేటాను భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
వీడియోను షేర్ చేస్తూ గోయెంకా.. ‘‘భారత్‌లో ఏఐ శిక్షణ జరుగుతోంది! త్వరలో బార్బర్ ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
డేటా కోసం మనుషులే అవసరమా?
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఏఐకి శిక్షణ ఇచ్చేందుకు ఇలా మనుషుల పనిని రికార్డు చేస్తున్నప్పుడు.. అందుకు కార్మికులకు సరైన పారితోషికం అందుతోందా? అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. మరొకరు ఇలాంటి విధానాలపై నియంత్రణ అవసరమని సూచించారు. మనుషుల పనితీరుతోనే ఏఐకి శిక్షణ ఇచ్చి చివరికి అదే టెక్నాలజీ వారి ఉద్యోగాలను దెబ్బతీసే పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కొందరు మాత్రం మానవ బార్బర్లకే తమ ఓటు అని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత పనిచేయకుండా పోయే రోబోట్ కంటే.. చేతులు కొద్దిగా వణికినా మనిషితోనే హెయిర్‌కట్ చేయించుకుంటామని సరదాగా వ్యాఖ్యానించారు.