సొంత మహిళా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలే తోసేశారు: మంత్రి సీతక్క సంచలన ఆరోపణ

09-09-2026 Wed 17:42 | Telangana
Advertisement
  • అసెంబ్లీ ఘటన వివాదంలో కొత్త కోణం
  • సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలను తోసేశారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆరోపణ
  • గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క
  • సీతక్క విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి
Advertisement
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల్లో బుధవారం మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సొంత పార్టీకి చెందిన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తోటి మహిళా సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు.

మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలను వారి పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వెనుక నుంచి నెట్టేశారని సీతక్క ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను పక్కకు తోసేసి గంగుల కమలాకర్ ముందుకు వెళ్లడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష ఎమ్మెల్యేలు ఇలా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.

గత సోమవారం నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. తమ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేయి చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, తాజాగా మంత్రి సీతక్క చేసిన ఆరోపణల ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పాయి.

మరోవైపు, విధులకు ఆటంకం కలిగించడం, మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి అభియోగాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ఎదుట చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిలబడ్డారని, తమను నెట్టివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన మహిళా పోలీసు సిబ్బందిని పరామర్శించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని ఆమె స్పష్టం చేశారు. కాగా, మంత్రి సీతక్క విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినవని, అవి ఏఐ-జనరేటెడ్ అని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు.
 
Advertisement
SeethakkaBRS MLAsTelangana AssemblySabitha Indra ReddyGangula KamalakarBRS Protest Controversy

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30
..more