'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత బోల్డ్‌గా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

09-09-2026 Wed 13:27 | Entertainment
Advertisement
  • సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆంథాలజీ
  • నాలుగు విభిన్న కథలను తెరకెక్కించిన నలుగురు ప్రముఖ దర్శకులు
  • సిద్ధార్థ్, అదితి, రాధికా ఆప్టే వంటి భారీ తారాగణం
  • ఆధునిక ప్రేమ, మానవ సంబంధాల నేపథ్యంలో సిరీస్ 
Advertisement
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోల్డ్ అంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆధునిక కాలంలో ప్రేమ, కోరికలు, మానవ సంబంధాల్లోని సంక్లిష్టమైన భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న ఈ కథలు గత భాగాల కన్నా మరింత బోల్డ్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ఆంథాలజీలో నలుగురు ప్రముఖ దర్శకులు నాలుగు విభిన్నమైన లఘు చిత్రాలను తెరకెక్కించారు. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ వంటి దిగ్గజ దర్శకులు తమదైన శైలిలో ఒక్కో కథను రూపొందించారు. దీంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక, ఇందులో కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్, రాధికా మదన్, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. రియల్ లైఫ్ కపుల్ నటుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించారు. విభిన్నమైన కథనాలతో రాబోతున్న ఈ ఆంథాలజీ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement
Lust Stories 3Netflix IndiaAditi Rao HydariSiddharthLust Stories 3 TrailerLust Stories 3 Release Date

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more