ఒక్క పరుగుతో తిలక్ వర్మ శ‌త‌కం మిస్‌.. కుప్పకూలిన సౌత్ జోన్.. ఈస్ట్ జోన్‌కు భారీ ఆధిక్యం

09-09-2026 Wed 13:10 | Sports
Advertisement
  • దులీప్ ట్రోఫీ ఫైనల్‌పై పట్టు బిగించిన ఈస్ట్ జోన్
  • తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం
  • ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్న తిలక్ వర్మ
  • 336 పరుగులకే కుప్పకూలిన సౌత్ జోన్
  • డ్రా అయితే ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్‌కే టైటిల్
Advertisement
చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ పట్టు బిగించింది. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించి టైటిల్ గెలుపునకు చేరువైంది. ఈస్ట్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్ విజేతగా నిలుస్తుంది.

నాలుగో రోజు ఆటలో భాగంగా 242/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన సౌత్ జోన్‌ను కెప్టెన్ తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశాడు. చామ మిలింద్‌ (43)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిలక్ వర్మ ఔటయ్యాడు.

సౌత్ జోన్‌ కేవలం 18 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. అంతకుముందు తొలి రెండు రోజుల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (270) అద్భుతమైన డబుల్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించిన విషయం తెలిసిందే. అతని ఇన్నింగ్సే ఈస్ట్ జోన్‌ను ఇంతటి పటిష్ఠ‌ స్థితిలో నిలబెట్టింది.
Advertisement
Tilak VarmaDuleep Trophy FinalIshan KishanSouth Zone vs East ZoneChennai CricketIndian Domestic Cricket

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more