ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్
- గగన్‌యాన్ తొలి మానవ రహిత యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు
- ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగం లక్ష్యంగా ఇస్రో ప్రణాళిక
- తొలి యాత్రలో అంతరిక్షంలోకి వెళ్లనున్న 'వ్యోమమిత్ర' రోబో
- మానవ భద్రతే అత్యంత ప్రాధాన్యమన్న ఇస్రో ఛైర్మన్ నారాయణన్
- మానవసహిత యాత్రకు ముందు మూడు మానవ రహిత ప్రయోగాలు
భారతదేశపు ప్రతిష్ఠాత్మక మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీలక ముందడుగు వేస్తోంది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే తొలి మానవ రహిత ప్రయోగానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ యాత్రను ఈ ఏడాది చివరి నాటికి నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మొదటి మానవ రహిత యాత్రను నాలుగో త్రైమాసికంలో ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ఈ యాత్రలో 'వ్యోమమిత్ర' అనే హాఫ్-హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. వ్యోమగాములు ప్రయాణించేటప్పుడు క్యాబిన్‌లోని పరిస్థితులను, వారి శరీర కదలికలను ఇది అనుకరిస్తుంది. మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు, భద్రతా ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు మొత్తం మూడు మానవ రహిత ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక వేసింది.
గగన్‌యాన్ మిషన్ కోసం కీలకమైన సాంకేతిక అభివృద్ధి దాదాపు పూర్తి కావచ్చిందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ప్రయోగానికి ఉపయోగించే లాంచ్ వెహికల్ (హెచ్ఎల్‌వీఎం 3)కు హ్యూమన్-రేటింగ్ ప్రక్రియ పూర్తయింది. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి కూడా పూర్తయ్యాయి. క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ అసెంబ్లీ, టెస్టింగ్ తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు దాదాపు 8,000 పరీక్షలు పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది.
ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపి, అక్కడ మూడు రోజుల పాటు ఉంచి, సురక్షితంగా భూమికి తీసుకురావడం గగన్‌యాన్ మిషన్ లక్ష్యం . ఈ ప్రయోగాన్ని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి చేపట్టనున్నారు. ఇప్పటికే వ్యోమగాములు రష్యాలో జనరిక్ శిక్షణ పూర్తి చేసుకోగా, బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో మిషన్-స్పెసిఫిక్ శిక్షణ పొందుతున్నారు.
ఈ మిషన్ అత్యంత సాంకేతికతతో కూడుకున్నదని, వ్యోమగాముల భద్రతకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని డాక్టర్ నారాయణన్ స్పష్టం చేశారు. ప్రతి వ్యవస్థను 100 శాతం సమీక్షించి, ధ్రువీకరించుకున్న తర్వాతే తుది ప్రయోగ తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కారణంగానే ప్రయోగ తేదీలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు.