షావుకారు జానకి చిరస్థాయిగా మనసుల్లో నిలిచిపోతారు: సీఎం చంద్రబాబు
- ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత
- ఆమె మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- చెన్నైలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన అలనాటి తార
- నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించి చెరగని ముద్ర
- పాత్రల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోతారన్న చంద్రబాబు
అలనాటి మేటి నటి షావుకారు జానకి (94) ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 400కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో అవార్డులు పొందిన జానకి భౌతికంగా దూరమైనా, ఆమె పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి శుక్రవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది.
1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి, చిన్నతనంలోనే రేడియో కళాకారిణిగా ప్రస్థానం ప్రారంభించారు. 1950లో విడుదలైన 'షావుకారు' చిత్రంతో వెండితెరకు పరిచయమై, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 385కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.
కథానాయికగా 'పాండురంగ మహత్యం', 'చరణదాసి', 'భాగ్యరేఖ', 'మంచి మనసులు', 'డాక్టర్ చక్రవర్తి' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 'సంసారం ఒక చదరంగం', 'గీతాంజలి', 'శుభాకాంక్షలు', 'మేడమ్' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో చెరగని ముద్ర వేశారు. 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' ఆమె నటించిన చివరి చిత్రం.
నటనకు ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో 'పద్మశ్రీ'తో సత్కరించింది. ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె సోదరి కృష్ణకుమారి కూడా అలనాటి ప్రముఖ హీరోయిన్ అని తెలిసిందే. షావుకారు జానకి మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.