గోవిందా-కోమల్ ప్రేమాయణంలో ట్విస్ట్.. పెళ్లికి ప్లాన్ చేశారంటూ సునీత ఆరోపణ!

Govinda Sunita Ahuja Conflict New Twist Allegations Of Marriage Plans
  • రాఖీ సావంత్ ఫోన్ ద్వారా మీడియా ముందు సునీత వ్యాఖ్యలు
  • భర్త గోవిందాపై పెట్టిన విడాకుల కేసును వెనక్కి తీసుకున్న సునీత
  • కుటుంబ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంపై గోవిందా మేనేజర్ అసహనం
  • కొన్ని నెలలుగా గోవిందా, సునీత మధ్య విభేదాలు  
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన అర్ధాంగి సునీత అహుజాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. విడాకుల కేసును వెనక్కి తీసుకున్న సునీత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త గోవిందా, నటి కోమల్ రాణి స్వర్ణాకర్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో వారి కుటుంబ గొడవ మరోసారి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న నటి రాఖీ సావంత్.. హఠాత్తుగా సునీత అహుజాకు ఫోన్ చేసి స్పీకర్‌ ఆన్ చేశారు. ఆ సమయంలో సునీత మాట్లాడుతూ.. "గోవిందా, కోమల్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు" అని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఇదే సమయంలో రాఖీ సావంత్ జోక్యం చేసుకుని, "విడాకుల కేసు వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి రూ.200 కోట్లు మీ పేరు మీద రాయించుకోండి, లేదంటే ఇతరులు దాన్ని తీసుకెళ్లిపోతారు" అని సునీతకు సలహా ఇచ్చారు.

ఆగస్టు 19న గోవిందాపై పెట్టిన విడాకుల కేసును సునీత వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై గోవిందా మేనేజర్ శశి సిన్హా 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే ఉండాలి. కోర్టు వరకు వెళ్తే ప్రపంచానికి తెలిసిపోతుంది. అసలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఏముంది? కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజే కేసును వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు, అసలు దాన్ని ఎందుకు ఫైల్ చేశారు? ఈ పరిణామం నన్ను బాధిస్తోంది. మనం ఎందుకు నలుగురిలో నవ్వులపాలు కావాలి?" అని ఆయన ఆవేదన చెందారు.

గత కొన్ని నెలలుగా గోవిందా, సునీత సంబంధంపై పుకార్లు వస్తున్నాయి. ఇటీవలే ఎయిర్‌పోర్టులో గోవిందా, నటి కోమల్ రాణితో కలిసి కనిపించడంతో సునీత అతన్ని 'షుగర్ డాడీ' అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై గోవిందా కూడా స్పందిస్తూ, సునీత పబ్లిక్‌లో వాడిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వినాయక చవితి రోజున ఇద్దరూ కలిసి మీడియాకు పోజులిస్తూ.. తమను దేవుడు కూడా విడదీయలేడని సునీత బలంగా చెప్పారు. కానీ కొన్ని రోజులకే మళ్లీ విభేదాలు బయటపడటం గమనార్హం. 1987లో వివాహం చేసుకున్న గోవిందా, సునీత దంపతులకు కుమార్తె టీనా, కుమారుడు యశవర్ధన్ ఉన్నారు. సుదీర్ఘకాలం సాగిన వీరి దాంపత్య జీవితం ఇలా బహిరంగ ఆరోపణలతో వార్తల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Govinda
Sunita Ahuja
Komal Rani Swarnakar
Rakhi Sawant
Govinda Divorce Case
Bollywood Celebrity News

More Telugu News