రష్యాలో డ్రోన్ దాడి.. భారత వైద్య విద్యార్థికి గాయాలు
- రష్యాలోని ఉఫాలో డ్రోన్ దాడిలో భారత విద్యార్థికి గాయాలు
- బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న బాధితుడు
- విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించిన భారత ఎంబసీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, రష్యాలోని ఉఫా నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ విద్యార్థి గాయపడ్డారు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఉఫాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ఈ విద్యార్థిపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) తక్షణమే స్పందించింది. గాయపడిన విద్యార్థితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సదరు విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు.
గత మూడు రోజులుగా రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో, మాస్కోకు సుమారు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలక పారిశ్రామిక నగరం ఉఫా లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడి చమురు శుద్ధి కర్మాగారంపై సైతం దాడులు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.