హీరోకి తగ్గ ఫ్యాన్స్.. సామాజిక సేవలో అల్లు అర్జున్ అభిమానుల రికార్డు
- సామాజిక సేవలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముందంజ
- లక్ష మంది యువతులకు క్యాన్సర్‌పై అవగాహన
- కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 400 పైగా ఈవెంట్లు
- హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై ప్రచారం
- అభిమానుల సేవకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు
అభిమాన సంఘాలు అంటే కేవలం తమ హీరో సినిమాలను ప్రమోట్ చేయడానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతోనూ ముందుండొచ్చని ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (ఆఫా) నిరూపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' కార్యక్రమంలో భాగంగా 'ఆఫా' ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది.
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, సుమారు లక్ష మంది యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించింది. యువతులు, బాలికలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేవలం సినిమాలపైనే కాకుండా సామాజిక అంశాలపై కూడా దృష్టి సారిస్తున్న 'ఆఫా' సభ్యుల కృషికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ తారలు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.