నా బాధను మరిపించిన మహానుభావుడు ఈవీవీ: నటుడు బాబూ మోహన్ 

Babu Mohan Interview
  • కొడుకు మరణం కుంగదీసిందన్న బాబూ మోహన్
  • బ్రతకాలనిపించలేదని వెల్లడి
  • తన బాధను ఈవీవీ అర్థం చేసుకున్నారని వ్యాఖ్య 
  • తనని మామూలు మనిషిని చేశారని వివరణ 


బాబూ మోహన్ .. కామెడీని తనదైన స్టైల్లో పరుగులు పెట్టించిన నటుడు. అప్పటివరకూ లేని ఒక డైలాగ్ మాడ్యులేషన్ .. బాడీ లాంగ్వేజ్ ను బాబు మోహన్ పరిచయం చేశారు. ఊతపదాలను మళ్లీ ఉత్సాహపరిచిన నటుడాయన. ఒకానొక దశలో బాబూ మోహన్ లేని సినిమా అంటూ ఉండేది కాదు. పోస్టర్ పై ఆయన కనిపిస్తేనే థియేటర్స్ కి వెళ్లిన అభిమానులు ఉన్నారు. అలాంటి బాబు మోహన్, తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

" మా అమ్మ చనిపోయినప్పుడు నాకు తెలియదు. కానీ మా అబ్బాయి చనిపోయినపుడు మాత్రం ఆ బాధను తట్టుకోలేకపోయాను. నేను కూడా చనిపోవాలని అనుకున్నాను. మా బాబు చనిపోయిన తరువాత నేను 3 నెలల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఒక రోజున నేను బయటికి వచ్చినప్పుడు, అదే వీధిలో ఉండే ఈవీవీగారు నన్ను చూశారు. ఆ సమయంలో ఆయన 'ఎవడిగోల వాడిది' సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. 50 రోజుల పాటు షూటింగ్ కోసం, మర్నాడు 'బ్యాంకాక్' వెళ్లనున్నారు. 

" ఈవీవీ గారు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారు. సంపాదించిన పేరు చాలు .. డబ్బు చాలు .. అసలు నాకు బ్రతకాలని లేదు అంటూ నేను మాట్లాడాను. ఆయన ఏమోననుకున్నారో తెలియదు గానీ, వెంటనే బ్యాంకాక్ కి నాకు టికెట్ వేయించారు. నేను వారిస్తున్నా వినిపించుకోకుండా, ఆ మరునాడు నన్ను వెంటబెట్టుకుని బ్యాంకాక్ తీసుకుని వెళ్లారు. 46వ రోజున నా పోర్షన్ అయిపోయింది. ఈ 46 రోజులలో నన్ను మామూలు మనిషిని చేసి పంపించారు. నా బాధను మరిపించి .. నన్ను మామూలు మనిషిని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది" అని ఆయన అన్నారు. 

Advertisement
Babu Mohan
EVV Satyanarayana
Telugu Actor Babu Mohan
Evadi Gola Vaadidi Movie
Babu Mohan Son Death
Suman TV Interview

More Telugu News