'దండేసి దండం పెట్టి అడుగుతున్నా.. వినకపోతే కాళ్లు పట్టుకుంటా'.. జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో వైరల్!
- తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యపై జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టి
- మాట వినని వ్యాపారులకు పూలదండలు వేసి, స్వీట్లు పంపిణీ
- ప్రేమగా చెబుతున్నా.. వినకపోతే కాళ్లు పట్టుకుంటానన్న జేసీ
- అప్పటికీ మారకపోతే షాపులకు తాళాలు వేస్తానని తీవ్ర హెచ్చరిక
- నెట్టింట వైరల్ అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి 'స్వీట్ వార్నింగ్' వీడియో
ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక శైలిని కలిగిన టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తాడిపత్రిలో తీవ్రంగా మారిన ట్రాఫిక్ సమస్యకు ముగింపు పలికేందుకు వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. పదేపదే చెప్పినా మాట వినని కొందరు వ్యాపారులకు స్వయంగా పూలదండలు వేసి, స్వీట్లు తినిపించి గాంధీగిరి ప్రదర్శించారు. ప్రేమగా చెప్పినా వినకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, ముఖ్యంగా రోడ్ల పక్కన, దుకాణాల ముందు ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి వచ్చింది. గత కొంతకాలంగా ఆయన ఈ విషయంపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్క్ చేయాలని, రోడ్లకు అడ్డంగా పెట్టవద్దని పలుమార్లు సూచించారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడంతో ఆయన నేరుగా కార్యాచరణకు దిగారు.
ఈ క్రమంలో పుట్లూరు రోడ్డులో పర్యటిస్తున్న ఆయనకు కొన్ని షాపుల ముందు రోడ్డుకు అడ్డంగా బైక్‌లు పార్క్ చేసి ఉండటం కనిపించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైనప్పటికీ, ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేరుగా అక్కడికి వెళ్లి, ఆ దుకాణాల యజమానులకు ప్రేమగా పూలదండలు వేశారు. అంతేకాకుండా వారికి స్వీట్లు కూడా తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తిట్టి, కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకే ప్రేమగా ఇలా దండలు వేసి, స్వీట్లు ఇచ్చాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించండి" అని కోరారు. "ఇంకా వినకపోతే మీ కాళ్లు కూడా పట్టుకుంటాను" అంటూ వినయంగా అభ్యర్థించారు.
అయితే, తన అభ్యర్థన తర్వాత కూడా మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. "అప్పటికి కూడా మీరు మారకపోతే, నేనే స్వయంగా వచ్చి మీ షాపులకు తాళాలు వేస్తాను. ఇంతకంటే నేను ఏం చేయాలో మీరే చెప్పండి" అని వ్యాపారులను నిలదీశారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు ఇద్దరూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాపారులకు దండలు వేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి