చమురు ధరల సెగ.. స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 71 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 29.85 పాయింట్లు దిగజారిన నిఫ్టీ
- హర్మూజ్ ఉద్రిక్తతతో పెరిగిన క్రూడ్ ధరలు
- నష్టాల్లో ముగిసిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు
- ఫార్మా, రియల్టీ సూచీల్లో అమ్మకాలు
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించవచ్చన్న వార్తలు మదుపరుల్లో ఆందోళన పెంచాయి. దీంతో ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణంపై భయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 78,009.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 29.85 పాయింట్లు తగ్గి 24,366 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 24,405 స్థాయిని తాకినా.. అమ్మకాల ఒత్తిడితో కిందకు దిగొచ్చింది.
నిఫ్టీకి 24,300-24,250 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. 24,400 ప్రాంతంలో నిరోధం కొనసాగుతోందని పేర్కొన్నారు.
ముడిచమురు ధరల పెరుగుదల భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో భారత్ ఒకటి కావడంతో క్రూడ్ ధరలు పెరిగితే దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి పరిణామాలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.
నిఫ్టీలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.53 శాతం, స్మాల్‌క్యాప్ 0.69 శాతం దిగజారాయి.
మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దాదాపు ఒక శాతం లాభపడింది. ఫార్మా, రియల్టీ సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగాయి. రూపాయి స్థిరత్వం, పదేళ్ల బాండ్లపై రాబడులు తగ్గడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు క్రమంగా పెరగడం దేశీయ మార్కెట్‌కు కొంత మద్దతిస్తున్నాయని నిపుణులు తెలిపారు.