ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్
- భుజానికి విజయవంతంగా సర్జరీ
- 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో గాయపడిన యంగ్ టైగర్
- పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భుజానికి బుధవారం వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ (రిహాబిలిటేషన్) ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
"డ్రాగన్" సినిమా చిత్రీకరణలో భాగంగా జూలై 27న ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆయన వేగంగా, సంపూర్ణంగా కోలుకోవాలంటే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో, ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి నేతృత్వంలోని వైద్య బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నేను ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. కిమ్స్ వైద్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు. మీ మద్దతే నా బలం. త్వరలోనే మళ్ళీ కలుద్దాం" అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కు గాయం కావడంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' చిత్ర శ్రీలంక షెడ్యూల్ వాయిదా పడింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజూ మీనన్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.