ట్రంప్ సీక్రెట్ జర్నీ.. ఇరాన్ ముప్పుతో పక్కా ప్లాన్‌తో ఎస్కేప్!
- ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న సమాచారంతో టర్కీలో ట్రంప్ రహస్య విమాన ప్రయాణం
- ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కినట్లు నటించి, క్యాటరింగ్ ట్రక్కులో వెళ్లి మరో విమానంలో జర్నీ
- ఈ రహస్య ఆపరేషన్‌ను తన కథనంలో వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్
- అధ్యక్షుడి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని పరోక్షంగా అంగీకరించిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో తుర్కియే పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు అత్యంత రహస్యంగా ప్రయాణించినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయన అందరూ భావించినట్లు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా మరో సైనిక విమానంలో రహస్యంగా ప్రయాణించారని ఆ కథనం పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు ముగిశాక, ట్రంప్ కెమెరాల ముందు పాత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే, ఆ తర్వాత ఆయన్ను ఒక ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా రహస్యంగా మరోచోట ఉన్న చిన్న సైనిక విమానం (ఎయిర్‌ఫోర్స్ సి-32ఏ) వద్దకు తరలించారు. ఆ విమానంలోనే ఆయన బ్రిటన్‌కు చేరుకున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ట్రంప్ ప్రయాణిస్తున్నట్లు అందరూ భావించిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం కూడా కొన్ని నిమిషాల తేడాతో అక్కడికి చేరుకుంది.
పాత జ్ఞాపకాల కోసం ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేసినప్పటికీ, అసలు కారణం ఇరాన్ నుంచి పొంచి ఉన్న భద్రతా ముప్పేనని స్పష్టమవుతోంది.
ఈ కథనంపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. "అధ్యక్షుడిపై అమెరికా శత్రువులు కన్నేశారు. వారి నుంచి రక్షణ కల్పించడానికి మా వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తాం" అని కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవ్ చుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ రహస్య ప్రయాణంపై పెంటగన్ ఇంకా స్పందించలేదు.