‘అలా మాట్లాడొద్దు’.. థరూర్ వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ సీరియస్
- ఇటీవల అలహాబాద్‌లో యువతతో రాహుల్ సభ
- దీనికి జంతర్ మంతర్ స్థాయిలో మద్దతు రాలేదన్న శశి థరూర్
- ఎందుకు వారితో కనెక్ట్ కాలేకపోతున్నామో విశ్లేషించుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు హితవు
- బీజేపీకి మేలు చేసే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేసీ హెచ్చరిక
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాన్ని ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో పోల్చుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారానికి దారితీశాయి. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. పార్టీ నేతలంతా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భాజపాకు మేలు చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని వేణుగోపాల్ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీపై ఎవరైనా విమర్శలు చేస్తే భాజపా సంతోషిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను భావించడం లేదన్నారు.
రాహుల్‌గాంధీ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన వచ్చిందని వేణుగోపాల్ చెప్పారు. అలహాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జెన్-జీ యువత పాల్గొందన్నారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. నిరసనల్లో పోలీసుల చర్యతో గాయపడిన విద్యార్థుల సమస్యను రాహుల్‌గాంధీ తొలుత ప్రజల ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
థరూర్ ఏమన్నారు?
ఇటీవల ప్రతిపక్ష పార్టీలు యువతతో ఎందుకు పూర్తిగా అనుసంధానం కాలేకపోతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని శశిథరూర్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనకు వచ్చిన యువతకు రాజకీయ పార్టీల్లోకి రావడానికి సరైన మార్గం కల్పించలేకపోయామని చెప్పారు.
రాహుల్‌గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమానికి జంతర్‌మంతర్ నిరసన స్థాయిలో స్పందన రాలేదా అని ప్రశ్నించగా.. ‘‘అవును. అందుకే మనం ఏం చేయలేకపోయామో ఆలోచించాలి’’ అని థరూర్ బదులిచ్చారు. అయితే తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తర్వాత వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో చోటు కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు.