‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్ మెసేజ్!
- పుట్టినరోజు శుభాకాంక్షలకు మహేశ్‌బాబు కృతజ్ఞతలు
- అభిమానుల ప్రేమే తన బలమని పేర్కొన్న స్టార్
- ‘వారణాసి’ తనకు చాలా ప్రత్యేకమని వ్యాఖ్య
- పుట్టినరోజున రుద్ర పాత్ర పోస్టర్లు విడుదల
- ఆఫ్రికా షెడ్యూల్ చిత్రీకరణకు రాజమౌళి ప్రశంసలు
- ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల
పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రేమకు టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలతో మనసు నిండిపోయిందని చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
అభిమానులను ఉద్దేశించి మహేశ్‌బాబు ప్రత్యేకంగా స్పందించాడు. ‘‘మీరు చూపించే ప్రేమే నా బలం. మీ అభిమానం నన్ను ఎంతో అదృష్టవంతుడిగా భావించేలా చేస్తోంది. మీ కోసం మరింత కష్టపడి పనిచేస్తా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా’’ అని పేర్కొన్నాడు.
తన తదుపరి చిత్రం ‘వారణాసి’పై కూడా మహేశ్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం రెండు ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసింది. ఇందులో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు తొలిసారి కనిపించాడు. ఒక పోస్టర్‌లో దట్టమైన అడవిలో వెదురు తెప్పపై కనిపించగా.. మరో పోస్టర్‌లో ఆఫ్రికాలోని మసాయ్ మారా ప్రాంతంలో జిరాఫీలు, ఇతర వన్యప్రాణుల మధ్య కనిపించాడు.
దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానుంది.