ఎల్ నినో ముప్పు: కార్యాచరణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు.. 'జలధార-జలహారతి' నిరంతరం
- ఎల్ నినో ప్రభావంతో 39 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం
- 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సీఎం ఆదేశం
- తాగునీటి సరఫరా, పంటల రక్షణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
- పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం
- నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం
రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం అంచనాలకు మించి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జల వనరుల పరిరక్షణ కోసం చేపట్టిన 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని ఇకపై ఒక నిరంతర కార్యక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, పంటల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి.. జలధార-జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
39 శాతం లోటు వర్షపాతం.. తీవ్ర నీటి సంక్షోభం
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాధారణంగా 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 525 మి.మీ. మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనాలను నివేదించారు.
ముఖ్యంగా ఆగస్టు నెలలో లోటు 56 శాతానికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రిజర్వాయర్లపై స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బేసిన్లలో కలిపి ప్రస్తుతం 563.05 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేదని పోల్చి చెప్పారు. ఆగస్టు నుంచి భూగర్భ జలమట్టాలు కూడా వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటి సరఫరాకే అగ్ర ప్రాధాన్యం
ఎల్ నినో తీవ్రత దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి వంటి రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా నీటిని నిల్వ చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులపై వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసి పట్టుకుని, ప్రాజెక్టులను వీలైనంత మేర నింపాలని దిశానిర్దేశం చేశారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
పంటలు, పశుసంపద రక్షణకు చర్యలు
వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రాధాన్యతా క్రమంలో నీటిని విడుదల చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని చెప్పారు. అదే సమయంలో, పరిశ్రమలకు కూడా నీటి కొరత లేకుండా చూడాలన్నారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల గోకులాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటి వినియోగం, పొదుపుపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని కోరారు.
ఈ సమీక్షలో అధికారులు 'జలధార-జలహారతి' కార్యక్రమ పురోగతిని సీఎంకు వివరించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.3,409.35 కోట్ల అంచనాతో 82,865 పనులు గుర్తించగా, ఇప్పటికే 79,826 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్ల వంటి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.